News January 27, 2025
జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. మల్యాలలో 14.1℃, మల్లాపూర్, తిరమలాపూర్ 14.6, సారంగాపూర్ 14.7, కొల్వాయి, పెగడపల్లి 15.1, పూడూరు, నేరెల్ల, మెట్పల్లి, కోరుట్ల 15.2, బుద్దేష్‌పల్లి 15.3, జగిత్యాల, రాఘవపేట, మద్దుట్ల 15.4, గోవిందారం, ఐలాపూర్, కథలాపూర్ 15.5, మన్నెగూడెం, గోదూర్ 15.6, జగ్గసాగర్ 15.8, జైన 15.9, రాయికల్ 16, అల్లీపూర్ 16.1, గుల్లకోట, మేడిపల్లి, వెల్గటూర్లో 16.2℃గా నమోదైంది.
Similar News
News February 13, 2025
MDK: బర్డ్ ఫ్లూ దెబ్బ.. చికెన్ ధరలు అబ్బా

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి ధరలు అమాంతం తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.170గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.
News February 13, 2025
ఉడికించిన చికెన్, గుడ్లు తినొచ్చు: మంత్రి అచ్చెన్న

AP: బర్డ్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తింటే ప్రమాదం ఏమీలేదని తేల్చి చెప్పారు. బర్డ్‌ఫ్లూపై సోషల్ మీడియా, కొన్ని పత్రికలు భయాందోళనలు సృష్టిస్తున్నాయని, అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం, శాస్త్రవేత్తలతో చర్చించామని, కోళ్లకు వ్యాధి సోకిన ప్రాంతానికి ఒక కి.మీ పరిధికే ఇది పరిమితం అవుతుందని చెప్పినట్లు వెల్లడించారు.
News February 13, 2025
హుస్సేన్‌సాగర్ స్కైవాక్‌కు లైన్ క్లియర్

HYDలోని హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కై వాక్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే HMDA ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (PPP) విధానంలో నిర్మాణం చేపట్టాలని యోచిస్తోంది. హుస్సేన్ సాగర్ చరిత్రను దృష్టిలో పెట్టుకొని నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు. స్కైవాక్‌తో పాటు సైకిల్ ట్రాక్‌ను కూడా ఇక్కడ నిర్మించనున్నారు.