News April 18, 2025
జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న ఎండ తీవ్రత

జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. గురువారం జిల్లాలోని మల్లాపూర్‌లో గరిష్ఠంగా 42.1℃ నమోదైంది. మన్నెగూడెం 41.7, గొల్లపల్లి, అల్లీపూర్ 41.5, గోధూరు, నేరెల్ల 41.2, జైన, మేడిపల్లి 41.0, రాయికల్ 40.8, వెల్గటూర్, బుద్దేష్‌పల్లి, జగ్గసాగర్ 40.6, సారంగాపూర్ 40.5, కథలాపూర్, ఐలాపూర్ 40.4, పెగడపల్లి 40.3, సిరికొండ 40.2, జగిత్యాల, కోరుట్ల, మారేడుపల్లిలో 40.0℃ ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News December 29, 2025
కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి మండిపల్లి..!

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని మార్చడం దాదాపు ఖరారైంది. ఇదే అంశంపై క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. ఈక్రమంలో మంత్రి మండిపల్లి కన్నీటి పర్యంతం కాగా.. ఆయనను సీఎం చంద్రబాబు ఓదార్చరని సమాచారం. రాయచోటి అభివృద్ధిని తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, రాయచోటితో అన్నమయ్య జిల్లా ఉంటుంది. జిల్లా కేంద్రం మదనపల్లె అవుతుందని సమాచారం.
News December 29, 2025
ఆరావళి కొండల నిర్వచనంపై సుప్రీంకోర్టు స్టే!

ఆరావళి కొండల కొత్త నిర్వచనంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనివల్ల పర్యావరణానికి ముప్పు కలుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో పాత ఉత్తర్వులను ప్రస్తుతానికి నిలిపివేసింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఒక స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ తెలిపింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేస్తూ అప్పటివరకు మైనింగ్ పనులు ఆపాలని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది.
News December 29, 2025
ఈ నొప్పులతో థైరాయిడ్‌ను ముందుగానే గుర్తించొచ్చు

శరీరంలో కొన్నిభాగాల్లో వచ్చే నొప్పులు థైరాయిడ్ అసమతుల్యతకు సూచన అని నిపుణులు అంటున్నారు. సాధారణంగా థైరాయిడ్ హార్మోన్లలో అసమతుల్యత ఉంటే ఎముకలను బలహీనపరుస్తుంది. ఇది వివిధ ప్రదేశాలలో నొప్పికి దారితీస్తుంది. మెడ, దవడ, చెవి నొప్పులు తరచూ వస్తుంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది. వీటితో పాటు కండరాల నొప్పి, కీళ్లు, మోకాళ్ల నొప్పి ఎక్కువగా వస్తున్నా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.


