News March 11, 2025

జగిత్యాల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

జగిత్యాల జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. గడచిన 24 గంటల్లో వెల్గటూర్ 35.9°C, సారంగాపూర్, గొల్లపల్లి 35.8, అల్లిపూర్, జైన 35.7, కథలాపూర్ 35.6, మన్నేగుడెం 35.4, మారేడుపల్లి 35.1, మల్లాపూర్ 35.0, జగిత్యాల 34.9, సిరికొండ 34.7, మేడిపల్లి 34.6, కోరుట్ల 34.4, కొల్వై, నేరెళ్ళ 34.3, ఐలాపూర్, గుల్లకోట 34.2, జగ్గసాగర్ 34.1, రాయికల్, గోవిందం 34.0, మద్దుట్ల 33.8, పెగడపల్లి 33.7°C గా నమోదైంది.

Similar News

News March 15, 2026

దొరమామిడి జలాశయంలో గల్లంతైన మృతదేహాల లభ్యం

image

బుట్టాయగూడెం మండలం దొరమామిడి జలాశయంలో ఆదివారం ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన తుమ్మల నాగరాజు (30), తుమ్మల రమణ (35) గుబ్బల మంగమ్మ గుడికి వెళ్లారు. అనంతరం వారు జలాశయం స్నానం చేస్తుండగా వారు గల్లంతయ్యారు. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు.

News March 15, 2026

ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షాలు

image

AP: రాష్ట్రంలో రానున్న 3రోజులు ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో భిన్న వాతావరణం ఉంటుందని APSDMA అంచనా వేసింది. ద్రోణి, నైరుతి నుంచి వీచే గాలులతో రేపు SKLM, VZM, మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ELR, కృష్ణా, NTR, GNT, KNL, NDYL, ATP, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసేందుకు ఆస్కారం ఉందని చెప్పింది.

News March 15, 2026

పులిని పట్టుకునేందుకు ‘హనుమాన్’ బృందాలు: డిప్యూటీ సీఎం ఆదేశం

image

జిల్లాలో కలకలం రేపుతున్న పెద్దపులిని పట్టుకునేందుకు 10 హనుమాన్ బృందాలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆదివారం అధికారులతో మాట్లాడిన ఆయన, కూర్మాపురం తరహాలోనే పులిని బంధించి విశాఖ జూకు తరలించాలని సూచించారు. ఈ ఆపరేషన్ పర్యవేక్షణ బాధ్యతను సీసీఎఫ్ చలపతిరావుకు అప్పగించారు. పులి భయం లేకుండా ప్రజలకు భద్రత కల్పించాలని అటవీ శాఖను ఆదేశించారు.