News March 16, 2025

జగిత్యాల జిల్లాలో చికెన్ ధరలు ఇలా

image

జగిత్యాల జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్(విత్‌ స్కిన్) కేజీ రూ.170-180 ఉండగా..స్కిన్‌లెస్ కేజీ రూ.200 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.120-130 మధ్య ఉంది. కాగా, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా, ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ప్రతి ఆదివారం చికెన్ తినడం ఆనవాయితీగా మారింది.

Similar News

News September 18, 2025

రాహుల్ ఆరోపణలు నిరాధారం: ఈసీ

image

పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ చేసిన <<17748163>>ఆరోపణలు <<>>నిరాధారమని ఈసీ కొట్టిపారేసింది. ప్రజల ఓట్లు ఏ ఒక్కటి ఆన్‌లైన్ ద్వారా డిలీట్ చేయలేదని తెలిపింది. సంబంధిత వ్యక్తికి తెలియకుండా ఓట్లను తొలగించలేదని వెల్లడించింది. 2023లో అలంద్‌లో ఓట్లు డిలీట్ చేసేందుకు ప్రయత్నిస్తే FIR నమోదుచేశామని పేర్కొంది. అలంద్‌లో 2018లో బీజేపీ, 2023లో కాంగ్రెస్ గెలిచినట్లు తెలిపింది.

News September 18, 2025

HYD: 40% పెరిగిన వాహనాల సంఖ్య

image

6ఏళ్లలో HYD రోడ్లపై వాహనాల సంఖ్య 40% పెరిగింది. రోజుకు 1,500 నుంచి 2 వేల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. సిటీలోని మొత్తం వాహనాల్లో 63 లక్షల బైకులు, 16 లక్షల కార్లు రోడ్ల మీద తిరుగుతున్నాయి. కిలోమీటర్‌ రోడ్డుపై దాదాపు 8వేల టూవీలర్లు, 2 వేల కార్లు కనిపిస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

News September 18, 2025

లిక్కర్ స్కాం.. 20 చోట్ల ఈడీ తనిఖీలు

image

ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో బోగస్ పేమెంట్లకు సంబంధించి లావాదేవీలు చేసిన వారి సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.