News March 21, 2025
జగిత్యాల జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు

జగిత్యాల జిల్లాలో ఎండలు కాస్త తగ్గాయి. గురువారం జైన, జగ్గసాగర్ 38℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు మన్నెగూడెం 37.9, అల్లీపూర్, పెగడపల్లె 37.8, సారంగాపూర్ 37.6, మేడిపల్లె, మల్లాపూర్ 37.5, మారేడుపల్లి 37.4, రాయికల్ 37.1, వెల్గటూర్, జగిత్యాల 37, నేరెల్లా, కొల్వాయి 36.9, ఐలాపూర్ 36.9, గొల్లపల్లె 36.7, సిరికొండ 36.5, గుల్లకోటలో 36.2℃ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో గురువారం జిల్లాలో కాస్త చల్లటి వాతావరణం నెలకొంది.
Similar News
News November 12, 2025
కుటుంబం అంతమైనా బుద్ధి మారలేదు!

ఆపరేషన్ సిందూర్‌లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ <<17727105>>కుటుంబం<<>> అంతమైనా ఆ ఉగ్రవాద సంస్థ బుద్ధి తెచ్చుకోవట్లేదు. తాజాగా ఢిల్లీ పేలుడు ఘటనతో JeM లింకులు బయటపడ్డాయి. 2001 పార్లమెంట్ అటాక్, 2008 ముంబై దాడులు, 2016 పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై అటాక్స్, 2019 పుల్వామా అటాక్‌లో వందలాది అమాయకులను ఆ టెర్రరిస్టులు పొట్టనబెట్టుకున్నారు. JeM నాయకత్వ వికేంద్రీకరణ, పాక్ ISI సపోర్ట్‌తో రెచ్చిపోతున్నారు.
News November 12, 2025
GNT: జిల్లాలో అదనంగా 264 పోలింగ్ కేంద్రాలు

గుంటూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ద్వారా అదనంగా 264 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలి తెలిపారు. కలెక్టరేట్ వీసీ హాలులో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అదనంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
News November 12, 2025
VKB: స్కూల్లో విద్యార్థికి విద్యుత్ షాక్

వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద రక్షణ కంచె లేకుండా ఉన్న 33 కె.వి ట్రాన్స్ఫార్మర్ ప్రమాదానికి కారణమైంది. భోజన విరామ సమయంలో మూడవ తరగతి విద్యార్థి వంశీ ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. చేతులు, కాళ్లు కాలడంతో పాటు తలకు గాయాలు అయ్యాయి. ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.


