News April 3, 2025

జగిత్యాల జిల్లాలో తగ్గిన ఎండ తీవ్రత

image

జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత కాస్త తగ్గింది. బుధవారం బుద్దేష్‌పల్లిలో 37.5℃ నమోదైంది. నేరెల్లా 37.2, మల్లాపూర్ 37.1, మారేడుపల్లి 37, వెల్గటూర్ 36.9, సారంగాపూర్ 36.8, అల్లీపూర్ 36.7, జగ్గసాగర్ 36.5, గొల్లపల్లె 36.4, గోదూరు 36.3, ఐలాపూర్లో 36.1℃ ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ ఎండ ప్రభావం తక్కువగానే ఉంది. వాతవరణం చల్లగా ఉంది.

Similar News

News April 12, 2025

EVMలను ట్యాంపర్ చేయడం అసాధ్యం: CEC

image

EVMలను హ్యాక్ చేయవచ్చన్న US జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్ చేసిన వ్యాఖ్యలను CEC జ్ఞానేష్ కుమార్ ఖండించారు. ఇండియాలో వాడే EVMలు వంద శాతం సేఫ్, ట్యాంపర్ ప్రూఫ్ అని స్పష్టం చేశారు. వాటిని ఎలాంటి బ్లూటూత్ పరికరాలతో కనెక్ట్ చేయలేరని, అందుకే ట్యాంపర్ చేయడం అసాధ్యమని తేల్చి చెప్పారు. 5 కోట్ల VVPAT స్లిప్పులు లెక్కించినా.. ఎక్కడా తప్పులు దొర్లలేదని తెలిపారు.

News April 12, 2025

‘వనజీవి’ రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తాం: పవన్

image

AP: వనజీవి రామయ్య పర్యావరణ పరిరక్షణ కోసం ఆరు దశాబ్దాలుగా అలుపెరుగని కృషి చేసి, సుమారు కోటి మొక్కలు నాటారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. పచ్చదనం పెంచడానికి రామయ్య, ఆయన సతీమణి చేసిన వన యజ్ఞం ఎన్నో తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిస్తుందన్నారు. రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ, పచ్చదనం పెంపునకు కృషి చేస్తామన్నారు.

News April 12, 2025

NTR: ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ప్రతిభ

image

రాష్ట్ర వ్యాప్తంగా నేడు విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో గంపలగూడెంలోని ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థిని అపరంజి ఉత్తమ మార్కులు సాధించింది. మొదటి సంవత్సరం ఎంపీసీలో 470కి 452 మార్కులతో గంపలగూడెం మండలంలోని ప్రభుత్వ కళాశాలల్లో మొదటి స్థానంలో నిలిచింది. అపరంజి ఉత్తమ ఫలితాలు సాధించడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. 

error: Content is protected !!