News March 8, 2025
జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో వరుడు కిరణ్ సూసైడ్ చేసుకున్నాడు. రేపు పెళ్లి జరగాల్సి ఉండగా ఈ రోజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కిరణ్ ఆత్యహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.
Similar News
News December 3, 2025
ప్రకాశం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ప్రకాశం జిల్లాలోని వివిధ ఉన్నత, ప్రైమరీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకై కాంట్రాక్టు పద్ధతిన అకడమిక్ ఇన్స్పెక్టర్స్ను నియమిస్తున్నట్లు DEO కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఒంగోలులోని డీఈఓ కార్యాలయం నుంచి ఆయన ప్రకటన విడుదల చేశారు. అర్హులైనవారు ఈనెల 5లోగా దరఖాస్తులను మీ పరిధిలోని MEOలకు అందజేయాలన్నారు. వివరాలకు స్థానిక MEOలను సంప్రదించాలన్నారు.
News December 3, 2025
నకిలీ కాటాలతో రైతుల మోసం.. హైదరాబాద్ ముఠా అరెస్ట్

పత్తి కొనుగోలు కేంద్రాల్లో నకిలీ చిప్‌లు అమర్చిన కాటాలతో రైతులను మోసం చేస్తున్న హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ముఠాను కల్లూరు ఏసీపీ వసుంధర ఆదేశాల మేరకు తల్లాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్‌లో ఓగిలి శెట్టి శంకర్, జంపాల కోటేశ్వరరావు కీలక వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. వీరి నుంచి ఫోర్జరీ చేసిన చిప్‌లు, మదర్ బోర్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
News December 3, 2025
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: దీపక్ తివారి

జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంలో పని చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన రహదారులు, వంతెనలు, కల్వర్టులు, పాఠశాల భవనాలు, అదనపు గదుల పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు.


