News March 8, 2025

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం

image

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో వరుడు కిరణ్ సూసైడ్ చేసుకున్నాడు. రేపు పెళ్లి జరగాల్సి ఉండగా ఈ రోజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కిరణ్ ఆత్యహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.

Similar News

News December 7, 2025

VKB: నామినేషన్ల ఉపసంహరణ .. బుజ్జగింపుల పర్వం

image

వికారాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు మెంబర్ల నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. తీవ్ర పోటీ ఉన్న స్థానాల్లో, పోలింగ్‌కు ముందే తమ అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని ప్రధాన పార్టీల నాయకుల బుజ్జగింపులు మొదలయ్యాయి. మూడో విడత ఉపసంహరణ గడువు ఈ నెల 9న ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రత్యర్థులను విత్ డ్రా చేయించేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

News December 7, 2025

కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదు

image

మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదయింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు.. ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేశారంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఈ పోలీస్ స్టేషన్లో పలు కేసులు కాకాణిపై ఉన్నాయి.

News December 7, 2025

GP ఎన్నికలపై “బండి” ఫోకస్

image

GP ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకోవడానికి కేంద్రమంత్రి బండి సంజయ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. మొదటి విడత నామినేషన్లు వేసిన సర్పంచ్ అభ్యర్థులతో వర్చువల్‌గా మాట్లాడుతున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు మండలానికి ఒక అబ్జర్వర్ నియమించారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నుండి ఎలాంటి సహకారమైన అందిస్తామంటూ భరోసా కల్పిస్తున్నారు. విజయావకాశాలున్న జీపీలకు కరీంనగర్ నుంచి ప్రత్యేక టీంను పంపిస్తున్నారు.