News March 8, 2025
జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో వరుడు కిరణ్ సూసైడ్ చేసుకున్నాడు. రేపు పెళ్లి జరగాల్సి ఉండగా ఈ రోజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కిరణ్ ఆత్యహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.
Similar News
News March 11, 2026
శ్రీరాముడిని ‘కోదండ రాముడు’ అని ఎందుకు పిలుస్తారు?

శ్రీరామచంద్రుని ధనుస్సు పేరు కోదండం. ఇది వెదురుతో తయారైనట్లు చెబుతారు. బరువు నూరు కిలోలని ప్రతీతి. వనవాసంలో దండకారణ్యంలో రాక్షస సంహారం కోసం దీనిని ధరించాడని పురాణ వచనం. సముద్రుడిపై ఆగ్రహించినప్పుడు ప్రయోగించిన కోదండ బాణం అజేయమైనది. రాముడు ఈ కోదండ విల్లుతోనే రావణాసురుడిని, అతని సైన్యాన్ని అంతం చేసి ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ఆయనను ‘కోదండ రాముడు’ అని కొలుస్తారు.
News March 11, 2026
యుద్ధం సెగలు.. HYDలో పెరిగిన ధరలు

మిడిలీస్ట్ యుద్ధం మంటలతో IT కారిడార్ హాస్టళ్లలో ఉండేవారికి, నిరుద్యోగుల కడుపు కాలుతోంది. యుద్ధ నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ సరఫరా తగ్గడంతో చిన్న హోటళ్లలో ప్లేట్ టిఫిన్‌పై ₹5 వరకు పెంచేశారని ప్రజలు చెబుతన్నారు. దీనికి తోడు మధ్యాహ్నానికే గ్యాస్ అయిపోవడం, షట్టర్ కట్టేస్తుండటంతో 2 పూటలు కడుపు మాడుతోందంటున్నారు. హాస్టళ్లలో బేసిక్ మీల్స్ ఇవ్వాలని హాస్టళ్ల <<19350638>>అసోసియేషన్<<>> నిర్ణయించింది. దీనిపై మీ కామెంట్
News March 11, 2026
నేడు బుధాష్టమి.. ఏం చేయాలంటే?

బుధవారం, అష్టమి తిథి కలిసి వస్తే ఆరోజు ‘బుధాష్టమి’. ఇది శివకేశవులిద్దరికీ ప్రీతికరమని ప్రతీతి. నేడు పాటించే కొన్ని పరిహారాలతో కైవల్యప్రాప్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘నేడు ఉపవాసం ఉండాలి. బుధ ప్రతిమను కలశంపై ఉంచి పెసరపప్పు నైవేద్యం సమర్పించాలి. 8 బుధాష్టములు ఇలా చేస్తే పూర్వజన్మ పాపాలు తొలుగుతాయి. బుధ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది’ అని సూచిస్తున్నారు.


