News February 12, 2025
జగిత్యాల జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్!

@యువత గుండె నిబ్బరంతో ఉండాలన్న ధర్మపురి సీఐ @వెల్గటూరులో పురుడు పోసిన 108 సిబ్బంది @వెల్గటూరులో ప్రకృతి వైపరీత్యాలపై విద్యార్థులకు NDRF అవగాహన @మెట్పల్లి వైన్స్‌లో బాటిల్ పై MRP కంటే రూ.30 అదనపు వసూళ్లు @మెట్పల్లి చెర్ల కొండాపూర్‌లో మొరం అక్రమ రవాణా.. స్థానికుల ఆరోపణలు @కొండగట్టులో మోకాళ్లపై వెళ్లి స్వామిని దర్శించుకున్న భక్తుడు
Similar News
News October 29, 2025
గుంటూరు జిల్లాలో పలు బస్సు సర్వీసులు రద్దు

మొంథా తుఫాన్ నేపథ్యంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆర్టీసీ పలు సర్వీసులను రద్దు చేసినట్లు డీపీటీఓ సామ్రాజ్యం తెలిపారు. గుంటూరు-1, 2, మంగళగిరి, తెనాలి, పొన్నూరు డిపోల్లో కొన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారని, తద్వారా రద్దీ తగ్గడంతో సర్వీసులు తగ్గిస్తున్నట్లు తెలిపారు. కొన్నిచోట్ల వాగులు పొంగటం, చెట్లు పడటంతో రద్దు చేశామన్నారు.
News October 29, 2025
రేగొండ: ఎయిర్ కూలర్ వైరు తగిలి చిన్నారి మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం ఆర్జీ తండాలో హృదయ విదారక ఘటన జరిగింది. ఇంట్లో ఆడుకుంటున్న బానోతు అంజలి (3), కరెంటు బోర్డుకు, కిందకు వేలాడుతున్న ఎయిర్ కూలర్ వైరును ముట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News October 29, 2025
సూర్యాపేట: ప్రాణం తీసిన మొంథా తుఫాన్

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చందుపట్లలో విషాదం జరిగింది. మద్దిరాలకి చెందిన లక్ష్మీనారాయణ (45) ద్విచక్ర వాహనంపై మెడికల్ షాప్‌కు వెళ్తుండగా కొత్త బడి దగ్గర చెట్లు కూలి వ్యక్తి మృతి చెందాడు. తానంచర్ల నుంచి మద్దిరాల వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


