News February 19, 2025

జగిత్యాల జిల్లాలో నేటి CRIME NEWS!

image

@మెట్పల్లి ఎక్సైజ్ సీఐని సస్పెండ్ చేయాలంటూ కోరుట్లలోని కాంగ్రెస్ నేతల డిమాండ్ @మల్యాలలో కోతుల దాడి.. వ్యక్తికి గాయాలు @కొడిమ్యాలలో దారి తప్పిన చుక్కల దుప్పి @భీమారంలో సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన @రేపు మల్లాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఇసుక బహిరంగ వేలం @ఇబ్రహీంపట్నంలో చోరికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు @జగిత్యాల ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించిన ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశ్

Similar News

News November 1, 2025

‘గ్లోబల్ స్టార్’ కాదు ‘మెగా పవర్ స్టార్’

image

రాజమౌళి ‘RRR’ మూవీతో రామ్ చరణ్‌కు గ్లోబల్ స్టార్ ట్యాగ్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘గేమ్ ఛేంజర్‌’లో అదే ట్యాగ్‌ను మేకర్స్ ఉపయోగించారు. అయితే తాజాగా పెద్ది సినిమా పోస్టర్‌లో మెగా పవర్ స్టార్ అని కనిపించడం టీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇది మంచి నిర్ణయమని కొందరు అంటున్నారు. ట్యాగ్‌లతో వారి స్టార్‌డమ్‌కు ఎలాంటి డ్యామేజ్ ఉండదని మరికొందరు చెబుతున్నారు. మీరేమంటారు?

News November 1, 2025

ఎల్ఈడీ యూనిట్లను పర్యావరణహితంగా నిర్వహించండి: కలెక్టర్

image

ఎల్ఈడీ యూనిట్లను పర్యావరణహితంగా నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. శనివారం రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరంలోని ఎల్ఈడీ బల్బులు, లైట్ల తయారీ యూనిట్‌ను ఆయన పరిశీలించారు. వాయు, నీటి కాలుష్యాలను నివారించాలని, పర్యావరణానికి హాని కలిగించకుండా చూడాలని నిర్వాహకులకు సూచన చేశారు. తమ యూనిట్‌లో పలు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన బల్బులను తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News November 1, 2025

గుంటూరులో ఈ నెల 7న జాబ్ మేళా

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఈ నెల 7న గుంటూరు లాం చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జాబ్ మేళా నిర్వహించనుంది. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించారు. 30కి పైగా కంపెనీలు పాల్గొని వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. 10వ తరగతి నుంచి బీటెక్ చదువుకున్న విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు.