News February 3, 2025

జగిత్యాల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

image

జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నెల రోజుల ( ఫిబ్రవరి 1వ తేది నుంచి 28 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు నిర్వహించరాదని ఆయన అన్నారు.

Similar News

News December 5, 2025

రాబోయే పది రోజులు తీవ్ర చలి!

image

TG: రాబోయే 10 రోజుల్లో రాష్ట్రంలో తీవ్ర చలి గాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి బలమైన చలి గాలులు ప్రారంభమవుతాయని తెలిపారు. హైదరాబాద్‌లో రేపటి నుంచి చలి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.

News December 5, 2025

మీ పిల్లల స్టడీ టేబుల్‌పై ఇవి ఉన్నాయా?

image

పిల్లలు ఏకాగ్రతగా చదవాలంటే చక్కని స్టడీ టేబుల్ కీలకం. సరైన వెలుతురు ఇచ్చే డెస్క్ ల్యాంప్, పెన్సిల్/పెన్ హోల్డర్ ఫోకస్‌ పెంచుతాయి. మంచి కొటేషన్లు పిల్లలను మోటివేట్ చేస్తాయి. స్టడీ ప్లానర్ ఉంటే టైమ్ మేనేజ్‌మెంట్ నేర్పుతుంది. వాటర్‌ బాటిల్‌ పెట్టుకోవడం మంచిది. ఎక్కువ సౌండ్ చేయని గడియారం టేబుల్‌పై పెట్టుకోండి. ఒక చిన్న మొక్క ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

News December 5, 2025

ప్రెగ్నెన్సీలో ఇది ప్రాణాంతకం

image

బిడ్డకు జన్మనివ్వడం ప్రతి మహిళకూ పునర్జన్మలాంటిది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని కాంప్లికేషన్లు వచ్చి ప్రాణాలు కోల్పోతారు. వాటిల్లో ఒకటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం. దీనివల్ల గర్భంలోని ఉమ్మనీరు తల్లి రక్తంలో కలిసిపోతాయి. దీంతో శరీరం ప్రతిస్పందిస్తుంది. దీంతో ఊపిరి ఆడకపోవడం, బీపీ పెరగడం, గుండెకు రక్తసరఫరా ఆగిపోవడం, అధిక రక్తస్రావం జరిగి కొద్ది సమయంలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.