News February 18, 2025

జగిత్యాల జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు!

image

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా చలి తగ్గి క్రమంగా ఎండ తీవ్రత పెరిగింది. దీంతో జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని అభిప్రాయపడుతున్నారు. పొలం పనులకు వెళ్లాలంటేనే ఎండలకు భయపడుతున్నారు. మరోవైపు జిల్లాలోని పలు చోట్ల చెక్ డ్యాములు, చెరువులు సైతం ఎండే పరిస్థితికి వచ్చింది. మీ ప్రాంతంలో ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. 

Similar News

News November 25, 2025

26న BRS సన్నాహక సమావేశం: జీవన్ రెడ్డి

image

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈనెల 29న నిర్వహించనున్న ‘దీక్షా దివస్‌’ను విజయవంతం చేయడానికి నిజామాబాద్‌లో ఈ నెల 26న సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 ఒక మైలురాయి లాంటిదని ఆయన పేర్కొన్నారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అనే నినాదమే ఉద్యమానికి ఊపిరి పోసిందని ఆయన గుర్తు చేశారు.

News November 25, 2025

HYD: బాక్సు ట్రాన్స్‌ఫార్మర్లతో బేఫికర్!

image

‘చుట్టూ కంచె లేని ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్లు.. పట్టించుకోని పాలకులు’.. తరచూ TGSPDCLకి మాధ్యమాల ద్వారా అందే ఫిర్యాదులు. గ్రేటర్‌లో ఈ సమస్యకు చెక్ పెట్టేలా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదాలు నివారించేలా కాంపాక్ట్ సబ్‌స్టేషన్లు, బాక్సు టైప్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తొలుత కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, మిగతా ఏరియాలకు విస్తరించనున్నారు.

News November 25, 2025

జనగామ: డబుల్ బెడ్ రూంల పరిస్థితి ఏంటి.?

image

జిల్లాలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలు ఇప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. అప్పటి ప్రభుత్వంలో వాటిని పంచకపోవడం, కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకపోవడంతో కొన్ని గ్రామాల్లో నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని పేద కుటుంబాలకు వాటిని పంచి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.