News April 16, 2025

జగిత్యాల జిల్లాలో మండుతున్న ఎండలు

image

జగిత్యాల జిల్లాలో ఎండ దంచికొడుతుంది. మంగళవారం మల్లాపూర్, రాయికల్‌లో అత్యధికంగా 43℃ నమోదైంది. అల్లీపూర్ 42.9, గొల్లపల్లి 42.8, గోదూర్, జైన 42.7, ఐలాపూర్ 42.6, మన్నెగూడెం 42.5, మేడిపల్లి 42.2, రాఘవపేట, నేరెల్ల, బుద్దేష్‌పల్లి, సారంగాపూర్ 42, పెగడపల్లి 41.9, మెట్పల్లి, వెల్గటూర్ 41.5, పొలాస 41.4, మల్యాల, కథలాపూర్ 41.3, మారేడుపల్లి 41.2, కోరుట్ల 41.1, జగిత్యాల, కొల్వాయిలో 41℃ ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News October 16, 2025

ఈనెల 25నాటికి ఈ-పంట నమోదు పూర్తి చేయాలి: జేసీ

image

బాణాసంచా తయారీ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించాలని అనకాపల్లి జిల్లా జేసీ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో జేసీ మాట్లాడారు. బాణాసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా లోపాలను గుర్తించాలన్నారు. ఓటర్ లిస్టులకు సంబంధించి వెరిఫికేషన్ పూర్తి చేసి మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

News October 16, 2025

గద్వాల్: ‘అక్రమంగా మట్టి తరలిస్తున్నా పట్టించుకోని అధికారులు’

image

జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో మట్టి దందా ఆగడం లేదు. పట్టపగలే అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కొందరు ట్రాక్టర్‌ను ఆపి డ్రైవర్‌ను అడగగా రాజకీయ పార్టీ నాయకుల పేర్లు చెప్పాడు. రాజకీయ నాయకుల అండతో అక్రమ దందా జోరుగా సాగుతోంది. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News October 16, 2025

రాత్రిళ్లు పసుపు కలిపిన పాలు తాగుతున్నారా?

image

రోగనిరోధక శక్తిని పెంచేందుకు పసుపు కలిపిన పాలు తాగడం మేలని వైద్యులు చెబుతున్నారు. ఈ పాలను నెలరోజుల పాటు రాత్రిళ్లు తీసుకుంటే ఆరోగ్యకరమని అంటున్నారు. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా నిరోధిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముకలు, కీళ్లను బలపరచడమే కాకుండా జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. అంతేకాకుండా రాత్రి పూట ప్రశాంతమైన నిద్రకు ఉపయోగపడుతుంది.