News April 22, 2025
జగిత్యాల జిల్లాలో మండుతున్న ఎండలు

జగిత్యాల జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రాయికల్ మండలంలో 43.8℃ ఉష్ణోగ్రత నమోదైంది. పెగడపల్లి 43.6, వెల్గటూర్ 43.6, భీమారం 43.5, ధర్మపురి 43.5, సారంగాపూర్ 43.4, బుగ్గారం 43.4, కోరుట్ల 43.3, గొల్లపల్లి 43.3, కథలాపూర్ 43.2, మేడిపల్లి 43.2, ఎండపల్లి 42.6, బీర్పూర్ 43.1, మల్లాపూర్ 43.1, మల్యాల 41.5, ఇబ్రహింపట్నం 43, జగిత్యాల రూరల్ 42.7, మెట్‌పల్లి 42.4, జగిత్యాల 42, కొడిమ్యాలలో 41.4℃ ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News December 20, 2025
మీ డబ్బు.. మీ సొంతం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ జిల్లాలోని బ్యాంకుల్లో సుమారు రూ.66 కోట్ల క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఉదయాదిత్య భవన్‌లో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నామినీ వివరాలు లేకపోవడం, కేవైసీ అప్‌డేట్ చేయకపోవడం వల్ల ఈ నిధులు నిలిచిపోయాయని వివరించారు. ఖాతాదారులు వెంటనే తమ బ్యాంకు వివరాలు సరిచూసుకుని, నిబంధనల ప్రకారం సొంత నిధులను క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు.
News December 20, 2025
Unbelievable: ఈ వెజిటెబుల్ కేజీ రూ.లక్ష

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కూరల్లో హాప్ షూట్స్ ఒకటి. భారత మార్కెట్‌లో కేజీ రూ.85వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. వీటిలోని హ్యుములోన్, లుపులోన్ యాసిడ్స్ క్యాన్సర్ సెల్స్‌తో పోరాడుతాయని సైంటిస్టులు చెబుతారు. TB వంటి సీరియస్ వ్యాధుల చికిత్సకూ ఉపయోగిస్తారు. బిహార్, HPలోని కొన్ని ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి. వందల హాప్ షూట్స్ కలిస్తేనే కేజీ వరకు తూగడం, పండించడంలో సవాళ్లు, కోతలో కష్టమూ భారీ ధరకు కారణాలు.
News December 20, 2025
మైనర్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు: ASF SP

ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్‌పై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే కేసు నమోదు చేస్తామని ASF జిల్లా SP నితికా పంత్ తెలిపారు. వాహన యజమానులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలని సూచించారు.


