News February 9, 2025
జగిత్యాల జిల్లాలో మొదలైన ఎన్నికల సందడి

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుండటంతో గ్రామాల్లో ఆశావహులు తమదైన రీతిలో ప్రచారం మొదలు పెట్టారు. పలు చోట్ల మాజీ సర్పంచులతో పాటు.. యువకులు, ఇతరులు ఎన్నికల్లో నెగ్గేందుకు మంతనాలు ప్రారంభించారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని పలువురు ప్రధాన నేతలను కలుస్తున్నారు.
Similar News
News December 21, 2025
పెంచలకోనలో విశేష పూజలు

పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
News December 21, 2025
‘అన్ని పాఠశాలలో ముస్తాబు కార్యక్రమం తప్పనిసరిగా అమలు చేయాలి’

విశాఖలో అన్ని పాఠశాలలో ముస్తాబు కార్యక్రమం తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం విద్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. విద్యార్ధుల్లో వ్యక్తిగత శుభ్రతను, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా అమలు చేయాలని సూచించారు. మంచి అలవాట్లు వలన విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతిరోజు పాఠశాల ప్రార్థనా సమయం కంటే ఒక 5 నిముషాలు ముందు అమలు చేయాలని ఆదేశించారు.
News December 21, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

★SKLM: రసాభాసగా జడ్పీ సర్వసభ్య సమావేశం
★అంగన్వాడీలకు 5జీ ఫోన్లు అందించిన అచ్చెన్న
★జిల్లా సమగ్ర అభివృద్ధి కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే కూన
★శ్రీకాకుళం: కొనుగోలు సరే..నగదు సమయానికి చెల్లించేనా ?
★రణస్థలం: గుంతల రోడ్డులో అవస్థల ప్రయాణం
★వైసీపీ వలనే గంజాయి ప్రభావం పెరిగింది: మంత్రి అచ్చెన్న
★సారవకోట: గ్రామాల్లో బెల్టు షాపుల జోరు


