News March 11, 2025
జగిత్యాల జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు!

జగిత్యాల జిల్లాలో వరుస ఏసీబీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మార్చి 5న కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ-3గా విధులు నిర్వహిస్తున్న శంకరయ్య ఏసిబికి చిక్కాడు. ధర్మపురి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ మార్చి 6న ఏసీబీకి పట్టుబడ్డాడు. తీవ్రవిమర్శలు ఎదుర్కొంటున్న కోరుట్ల మున్సిపల్ కమిషనర్ తిరుపతిని మార్చి6న జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సస్పెండ్ చేశారు. ఈ పరిణామాలన్నీ జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.
Similar News
News February 23, 2026
KMR: జిల్లాస్థాయి భౌతిక-రసాయన శాస్త్ర టాలెంట్ టెస్ట్

భౌతిక రసాయ శాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో జిల్లాస్థాయి భౌతిక-రసాయన శాస్త్ర టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. DEO రాజు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు టాలెంట్ టెస్ట్‌లు ఉపయోగపడతాయన్నారు. టాలెంట్ పరీక్షలో ఆరాధ్య (ZPHS, రాజంపేట), శ్రేయాస్ (తెలంగాణ మైనార్టీ స్కూల్, మేనూర్) ప్రథమ స్థానంలో నిలిచారని ఫోరం అధ్యక్షులు తెలిపారు.
News February 23, 2026
తిరుపతి జిల్లాలో విషాదం

తిరుపతి జిల్లా బాలాయపల్లె మండలం వాక్యం గ్రామానికి చెందిన రైతు కొమ్ము గరిటయ్య (57) విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. తన పొలంలో విద్యుత్ మోటారు అమర్చే క్రమంలో స్టార్టర్ వద్ద విద్యుత్ షాక్ తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన బాలాయపల్లె పోలీసులు, అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 23, 2026
ఇంటికి ఏ దిశలో ఏ మొక్కలు నాటాలి?

ఇంటి చుట్టూ మొక్కలు పెంచడం శుభకరమని, గాలి శుద్ధై ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘వాస్తు ప్రకారం దక్షిణ, పడమర దిశల్లో ఎత్తైన చెట్లు, కూరగాయల మొక్కలు పెంచాలి. తూర్పు, ఉత్తర దిశల్లో చిన్న మొక్కలు ఉండాలి. ఈశాన్య మూలలో చెట్లు పెంచకూడదు. పాలు కారే, ముళ్ల చెట్లను ఉండకూడదు. ఈ నియమాలు పాటిస్తే అందం, ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


