News March 22, 2025
జగిత్యాల జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

జగిత్యాల జిల్లాలో శుక్రవారం ఉదయం నుండి శనివారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలు. అత్యధికంగా పెగడపల్లి మండలంలో 47.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా ఇబ్రహీంపట్నం మండలం గోధూర్‌లో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. బుగ్గారం మండలం సిరికొండలో 39.3, పొలాసలో 35, గొల్లపల్లి 33.3, వెలగటూర్ లో 32.8, మల్యాలలో 23, జగిత్యాలలో 12 కథలాపూర్లో 8.3మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Similar News
News March 28, 2025
భువనగిరి: రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి

యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్‌పై వెళ్తున్న వ్యక్తి వెనుక నుండి ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గౌరాయపల్లికి చెందిన కైరంకొండ హరీష్ (26)గా గుర్తించారు. 108 వాహనంలో భువనగిరి ఏరియా హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చనిపోయాడని డాక్టర్లు తెలిపారు.
News March 28, 2025
NGKL: అనాథ బాలికల వసతిగృహంలో ఆకస్మిక తనిఖీ

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని వాత్సల్య అనాధ బాలికల వసతి గృహాన్ని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ సబిత గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనాథ వసతిగృహంలో గదులను పరిశీలించారు. అందులో నివసిస్తున్న బాలికలకు అందిస్తున్న ఆహారాన్ని ఆమె పరిశీలించారు. డోనర్స్ అందించిన వస్తువులను బాలికలకు అందించడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వాష్ రూమ్‌లు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
News March 28, 2025
టెన్త్ స్టూడెంట్స్‌కు మధ్యాహ్న భోజనం

TG: టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలే ఎగ్జామ్ సెంటర్ అయి, అందులో గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే వారికి భోజనం పెట్టి ఇంటికి పంపించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21న ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి.