News April 5, 2025
జగిత్యాల: జిల్లాలో 25 బార్ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

జగిత్యాల జిల్లాలో రెన్యూవల్ కానీ 25 బార్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయటానికి ఆసక్తి గల వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 26 వరకు కరీంనగర్ జిల్లా ఎక్సైజ్, రాష్ట్ర ఎక్సైజ్ కార్యాలయంలో అప్లై చేసుకోవచ్చని అన్నారు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు
Similar News
News February 24, 2026
మొబైల్ యాప్‌తో పారదర్శకంగా యూరియా పంపిణీ: DAO

రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడకుండా ప్రభుత్వం యూరియా మొబైల్ యాప్ విధానాన్ని ప్రవేశపెట్టిందని DAO స్వరూప రాణి తెలిపారు. మంగళవారం జిల్లాలో యూరియా పంపిణీ ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యాప్ ద్వారా రైతులు సులభంగా యూరియా పొందేందుకు వీలుంటుందని, ఈ కొత్త పద్ధతిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. పంపిణీలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
News February 24, 2026
NZB: కలెక్టర్, సీపీతో రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఛైర్మన్ భేటీ

రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఛైర్మన్ తారిక్ అన్సారీ కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలను భేటీ అయ్యారు. మైనార్టీ సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు చేయాలని, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మైనార్టీ విద్యాలయాల్లో పూర్తి స్థాయి అడ్మిషన్లు జరిగేలా చూడాలని, ప్రభుత్వ సదుపాయాలపై అవగాహన పెంచాలని పేర్కొన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి పాల్గొన్నారు.
News February 24, 2026
హన్మకొండలో 1,104 మంది టీబీ రోగులు

హన్మకొండ జిల్లాలో 1,104 మందికి టీబీ ఉన్నట్లుగా గుర్తించినట్లు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ హిమబిందు బుధవారం తెలిపారు. క్షయ వ్యాధి నిర్ధారణ కోసం జిల్లాలో వైద్య శిబిరాలు నిర్వహించమన్నారు. 60 ఏళ్లు పైబడిన వారు, హెచ్ఐవీ ఎయిడ్స్ ఉన్నవారు, డయాబెటిస్ రోగులు, టీబీ కాంటాక్ట్ ఉన్న 1,93,935 మందికి పరీక్షలు చేశామని, 73,711 మందికి ఎక్స్‌రేలు తీయగా 1,104 మంది టీబీ రోగులను గుర్తించినట్లు తెలిపారు.


