News January 28, 2025
జగిత్యాల జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతుల దృష్ట్యా జగిత్యాల జిల్లాలో 5 రోజులు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ కార్యనిర్వహణధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో (వెల్గటూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల మండలాలు మినహాయించి) ఉన్న గ్రామాలకు, మున్సిపాలిటీలకు మిషన్ భగీరథ నీరు అందదన్నారు.5 రోజులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
Similar News
News November 22, 2025
సిరిసిల్ల: బడి చేరాలంటే వాగు దాటాల్సిందే..!

వాగు దాటితేనే ఆ ఊరి పిల్లలకు చదువు. ప్రతిరోజు విద్యార్థులు చదువు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. SRCL(D) కోనరావుపేట మండలంలోని వెంకట్రావుపేట, కొండాపూర్ గ్రామాల విద్యార్థులు మూలవాగు అవతల ఉన్న బావుసాయిపేట పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. వరద ఉద్ధృతికి ఏళ్ల క్రితం నాటి వంతెన కొట్టుకుపోగా పాలకులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోవడంలేదు. దీంతో చిన్నారులు నిత్యం వాగులో నుంచే పాఠశాలకు చేరుతున్నారు.
News November 22, 2025
HYD: నేడు కార్గో వస్తువుల వేలం

HYDలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో పెండింగ్లోని కార్గో, పార్సిల్ వస్తువులకు నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జోన్ లాజిస్టిక్ మేనేజర్ బద్రి నారాయణ తెలిపారు. MGBSలోని పార్సిల్ గోడౌన్ ఆవరణలో ఉదయం 10 గంటలకు వేలం ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వేలంలో పాల్గొనాలని కోరారు.
News November 22, 2025
సిరిసిల్ల: CESS ఆఫీసుకు వాస్తు దోషం ఉందట..!

CESS ఆఫీసుకు వాస్తు దోషం ఉందా అంటే తాజా పరిణామాలు చూస్తే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పాలకవర్గంలో విభేదాలు రావడం, అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలతో CESS కార్యాలయం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దీంతో ఛైర్మన్ చిక్కాల రామారావు నివారణ మార్గాలు అన్వేషిస్తున్నారు. హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామిని CESS కార్యాలయానికి ఆహ్వానించి వాస్తు దోషాలను చూడాలని కోరడం చర్చనీయాంశమైంది.


