News January 28, 2025

జగిత్యాల జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

image

మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతుల దృష్ట్యా జగిత్యాల జిల్లాలో 5 రోజులు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ కార్యనిర్వహణధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో (వెల్గటూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల మండలాలు మినహాయించి) ఉన్న గ్రామాలకు, మున్సిపాలిటీలకు మిషన్ భగీరథ నీరు అందదన్నారు.5 రోజులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

Similar News

News February 18, 2025

ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఎల్లుండి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి జరగాల్సిన ఏపీ క్యాబినెట్ భేటి వాయిదా పడింది.

News February 18, 2025

PHOTO OF THE DAY

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అకీరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి మహాకుంభమేళాలోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గంగా దేవికి పవన్ దంపతులు హారతులు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీరంతా కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ PHOTO OF DAY ఇదేనంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

News February 18, 2025

వేరే పార్టీ ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు?.. ఢిల్లీ LGపై ఠాక్రే ఫైర్

image

యమునా నది ప్రక్షాళన మొదలైందని, మూడేళ్లలో క్లీన్ చేస్తామని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చేసిన వ్యాఖ్యలపై MH మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే ఫైరయ్యారు. ‘రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ దీన్ని ప్రారంభించవచ్చు. కానీ రాజకీయాల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఇలాంటి స్వార్థ రాజకీయాల వల్లే ఇండియా వెనక్కి వెళ్తోంది’ అని ట్వీట్ చేశారు.

error: Content is protected !!