News April 13, 2025
జగిత్యాల జైత్రయాత్ర గురించి మీకు తెలుసా..?

వేలాది జనం భూస్వామ్య వ్యవస్థపై జగిత్యాలలో 1978 సెప్టెంబరు 9న రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభనే జగిత్యాల జైత్రయాత్రగా చరిత్రపుటల్లో లిఖించి ఉంది. ఈ సభకు ప్రజాయుద్ధనౌక గద్దర్ హాజరై తన ఆటపాటలతో జనాన్ని ఉర్రూతలూగించారు. రైతుకూలీ సంఘాలు పీపుల్స్ వార్‌గా, మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందడానికి జగిత్యాల జైత్రయాత్ర బీజం వేసిందని చెబుతుంటారు. తెలంగాణ విప్లవోద్యమ చరిత్రకు ఇది ఊపునిచ్చింది.
Similar News
News October 30, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* అమరావతి పరిధిలోని భూమిలేని నిరుపేదలకు పెన్షన్ల కోసం ప్రభుత్వం ₹71.09Cr విడుదల చేసింది.
* CRDA తీసుకున్న రుణాలపై వాయిదా చెల్లింపులకు ప్రభుత్వం ₹287Cr కేటాయించింది.
* అమరావతిలోని నెక్కల్లులో యువతకు నైపుణ్య శిక్షణకు L&T సంస్థ ₹369Crతో ఓ కేంద్రాన్ని నిర్మించనుంది. దీనికి సంస్థ ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు.
* అసంపూర్తిగా ఉన్న బీసీ హాస్టళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ₹60Cr మంజూరు చేసింది.
News October 30, 2025
GNT: రంగస్థల కళాకారుడి నుంచి దర్శకుడు దాకా

ప్రముఖ రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు బీరం మస్తాన్ రావు (అక్టోబర్ 30, 1944-జనవరి 28, 2014) గుంటూరులో జన్మించారు. అల్లు రామలింగయ్య, సుత్తి వీరభద్రరావు, జమున, గరికపాటి రాజారావు, తదితరులతో కలిసి నాటకాలలో నటించారు. బాలమిత్రుల కథ చిత్రంతో సహాయ దర్శకుడిగా సినిమా జీవితాన్ని ప్రారంభించారు. దర్శకుడిగా ఆయనకు తొలిచిత్రం కృష్ణ-శ్రీదేవి జంటగా నటించిన బుర్రిపాలెం బుల్లోడు.
News October 30, 2025
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంలో ఉద్యోగాలు

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం 7 క్యూరేటర్-B ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. ఎంఎస్సీ/బీఈ/బీటెక్/MS/ఎంటెక్/పీహెచ్‌డీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ncsm.gov.in/


