News October 19, 2024
జగిత్యాల: తమ్ముడిని ఇండియా రప్పించాలని కోరిన అన్న

కువైట్ వెళ్లిన తమ్ముడిని ఇండియాకు రప్పించాలని ప్రవాసీ ప్రజావాణిలో ఓ అన్న ఫిర్యాదు అందజేశాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన అనుదీప్ ఉద్యోగరీత్యా కువైట్ వెళ్లాడు. అనుదీప్ వెళ్లిన కొన్ని రోజులకే అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలో తన సోదరుడిని ఇండియాకు రప్పించాలని అనుదీప్ అన్న అనిల్ శుక్రవారం హైదరాబాద్ ప్రజాభవన్ లోని గల్ఫ్ ‘ప్రవాసీ ప్రజావాణి’ లో వినతిపత్రం సమర్పించారు.
Similar News
News November 16, 2025
KNR: 17 నుంచి అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని జిల్లా సంక్షేమ అధికారి కె.సబిత కుమారి తెలిపారు. నవంబర్ 17న జిల్లా పరిషత్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం, 18న మండలాల్లో ఆరోగ్య శిబిరాలు, 19న కలెక్టరేట్‌లో ప్రధాన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వయోవృద్ధులు ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె సూచించారు.
News November 16, 2025
చొప్పదండి: డ్రంక్ అండ్ డ్రైవ్ ఫైన్‌కు భయపడి యువకుడి ఆత్మహత్య

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఫైన్ చెల్లించలేనన్న మనోవేదనతో చొప్పదండి బీసీ కాలనీకి చెందిన సూర విజయ్ (28) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నరేష్ రెడ్డి తెలిపారు. ఈ నెల 1న పోలీసులకు పట్టుబడిన విజయ్, శనివారం కోర్టుకు హాజరైనప్పటికీ మేజిస్ట్రేట్ లేకపోవడంతో తిరిగి వచ్చాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫైన్ భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
News November 16, 2025
KNR: విటమిన్ గార్డెన్ పై దృష్టి పెట్టాలి:కలెక్టర్

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విటమిన్ గార్డెన్లపై బయోసైన్స్ ఉపాధ్యాయులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించి, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. గార్డెన్‌లను ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడంతో పాటు, పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరల్లోని విటమిన్లు, మినరల్స్ గురించి కూడా విద్యార్థులకు వివరించాలని ఆమె సూచించారు.


