News April 7, 2025
జగిత్యాల: తల్లిదండ్రులపై కుమారుడి దాడి.. తీవ్రగాయాలు

జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాం గ్రామంలో ఆదివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులపై గడ్డపలుగు, కొడవలితో కుమారుడు దాడి చేశాడు. స్థానికుల వివరాల ప్రకారం.. భూతగాదాల విషయంలో నరేష్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులు నాగరాజు, గంగమణిపై దాడి చేశాడు. దీంతో వారికి తీవ్రగాయాలు కావడంతో జగిత్యాలలోని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 2, 2026
కుసుమ పంట కోత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

యాసంగి పంటగా విత్తుకున్న కుసుమ.. నాటిన సమయాన్ని బట్టి ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. కొన్నిచోట్ల ఇది కోత దశలో ఉంది. అయితే ఈ కుసుమ పంటను ఉదయాన్నే కోయడం వల్ల గింజలు రాలడం తక్కువగా ఉండటమే కాకుండా ముల్లు మొత్తగా ఉండి కోత ప్రక్రియ ఈజీగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పంట కోత తర్వాత గింజలలో తేమ 5 నుంచి 8 శాతానికి వచ్చేవరకు ఆరబెట్టాలి. దీని వల్ల గింజ నాణ్యత బాగుంటుందని తెలిపారు.
News March 2, 2026
ఏలూరు: అత్యాచారానికి పాల్పడిన యూట్యూబర్ అరెస్ట్

జంగారెడ్డిగూడెంలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడు సోషల్ యూట్యూబర్‌గా చలామణి అవుతూ, సహాయం కోసం వచ్చిన యువతిపై అత్యాచారం చేశాడని ఏఎస్పీ సుస్మిత రామనాథన్ వెల్లడించారు. ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా పోలీసులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
News March 2, 2026
ప్రభుత్వ ఉద్యోగులకోసం కొత్త చట్టం

TG: తలిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతం నుంచి 10-15% కోత పెట్టి వారికి చెల్లించేలా చట్టాన్ని ప్రభుత్వం రూపొందిస్తోంది. పేరెంట్స్ ఫిర్యాదులపై విచారణ చేసి నిజమని తేలితే వారి జాయింట్ ఖాతాలో ఈ సొమ్ము జమచేయనుంది. CS రామకృష్ణారావు, మాజీ CS శాంతికుమారిలతో కూడిన కమిటీ ముసాయిదా చట్టాన్ని రూపొందిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ఆమోదించనుంది. 2023 నుంచి నియమితులైన వారికి ఈ చట్టం వర్తించనుంది.


