News April 7, 2025
జగిత్యాల: తల్లిదండ్రులపై కుమారుడి దాడి.. తీవ్రగాయాలు

జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాం గ్రామంలో ఆదివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులపై గడ్డపార, కొడవలితో కుమారుడు దాడి చేశాడు. స్థానికుల వివరాల ప్రకారం.. భూతగాదాల విషయంలో నరేష్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులు నాగరాజు, గంగమణిపై దాడి చేశాడు. దీంతో వారికి తీవ్రగాయాలు కావడంతో జగిత్యాలలోని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 24, 2025
KNR: గదిలో గంజాయి దాచి.. స్నేహితులతో సేవించి

కరీంనగర్ బ్యాంక్ కాలనీలో గంజాయి నిలువచేసి వినియోగిస్తున్న చిక్కులపల్లి సాయివిఘ్నేశ్ అనే యువకుడిని పట్టుకొని రిమాండ్ చేసినట్లు 3టౌన్ పోలీసులు తెలిపారు. లంబసింగి ప్రాంతం నుంచి 2కిలోల గంజాయి కొనుగోలు చేసి, తన ఇంటి టెర్రస్పై చిన్న గదిలో దాచిపెట్టి, తరచూ తన స్నేహితులతో కలిసి సాయివిఘ్నేశ్ గంజాయి సేవిస్తున్నాడని చెప్పారు. నమ్మదగిన సమాచారం మేరకు నిందితుడితోపాటు గంజాయిని నిన్న పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
News October 24, 2025
JMKT: నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

జమ్మికుంట పత్తి మార్కెట్లో నేటి నుంచి CCI ద్వారా పత్తి కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉండేలా చూసుకోవాలన్నారు. అలా అయితేన్ మద్దతు ధర పొందవచ్చన్నారు. CCI ద్వారా పత్తి అమ్ముకునే రైతులు ‘కపాస్ కిసాన్’ యాప్లో స్లాట్ బుక్ చేసుకొని కొనుగోలు కేంద్రాలకు పత్తి తీసుకురావాలన్నారు. సమస్యలుంటే 18005995779, వాట్సాప్ నంబర్ 8897281111లను సంప్రదించండి.
News October 24, 2025
కరీంనగర్: పరీక్ష కేంద్రం ఆకస్మిక తనిఖీ

శాతవాహన విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 17 నుంచి LLB కోర్సులో 4వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పరీక్షా కేంద్రమైన ఆర్ట్స్ కళాశాలను VC యూ.ఉమేష్ కుమార్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షలు ముగిసిన అనంతరం వాల్యూయేషన్ కూడా త్వరగా చేపట్టి ఫలితాలను సకాలంలో ప్రకటిస్తామని తెలిపారు.


