News September 29, 2024

జగిత్యాల: దసరా కానుకగా వెరైటీ లక్కీ డ్రా

image

జగిత్యాల జిల్లా భీమారం మండలంలో దసరా సందర్భంగా పలువురు యువకులు వెరైటీ లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. లక్కీ డ్రాలో 12 రకాల ఆఫర్లు పెట్టారు. రూ.100తో లక్కీ డ్రా తీస్తే మొదటి బహుమతిగా 2 కిలోల మటన్, రెండో బహుమతిగా మేక తల, మూడో బహుమతి నాటుకోడి పుంజు, ఇలా.. కోడిగుడ్లు, బీరు, విస్కీ, బట్టలు అంటూ 12 రకాల ఆఫర్స్ ఏర్పాటు చేశారు. అక్టోబర్ 11న లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

Similar News

News October 4, 2024

కరీంనగర్: రూ.17.88 కోట్ల బకాయిలు!

image

కరీంనగర్ జిల్లాలోని పలు మహిళా సంఘాలు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు ఉపాధితో పాటు ఇతర అవసరాలకు రుణాలు వినియోగించుకుంటున్నారు. కొందరు చెల్లించలేకపోవడంతో వడ్డీ, అసలు కలిపి భారంగా మారుతున్నాయి. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నగర, పురపాలికల్లో వేల సంఖ్యలో స్వశక్తి సంఘాలు పనిచేస్తున్నాయి. రుణం చెల్లించని సంఘాలు 576 ఉండగా, రూ.17.88 కోట్ల బకాయిలు ఉన్నాయి.

News October 4, 2024

పెద్దపల్లి: టెన్త్ విద్యార్థి మృతి

image

పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబీకుల ప్రకారం.. పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామానికి చెందిన కంటే చిన్నా(15) అనే పదో తరగతి విద్యార్థి వైరల్ ఫీవర్‌తో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. అయితే గత పదిరోజులుగా చిన్నా జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు రోజుల నుంచి జ్వరం విషమించడంతో రెండు కిడ్నీల్లో ఇన్‌ఫెక్షన్ వచ్చి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News October 4, 2024

కరీంనగర్: నేడు ముద్దపప్పు బతుకమ్మ

image

కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడోరోజు ‘ముద్దపప్పు బతుకమ్మ’గా అమ్మవారిని పూజిస్తారు. ఈరోజు మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, పూలతో బతుకమ్మను చేసి.. తామర పాత్రల్లో అలంకరిస్తారు. శిఖరంపై గౌరమ్మను ఉంచి పూజలు చేస్తారు. ప్రధానంగా ముద్దపప్పును నివేదిస్తారు కాబట్టి ‘ముద్దపప్పు బతుకమ్మ’గా పిలుస్తారు. మూడోరోజు వాయినంగా ముద్దపప్పు, సత్తుపిండి, పెసర్లు, బెల్లం కలిపి పెడతారు.