News February 1, 2025
జగిత్యాల: దివ్యాంగుల దరఖాస్తుల తేదీ పొడిగింపు..!

జిల్లాలోని దివ్యాంగుల ఉపాధి, పునరావాస పథకం 2024-25 దరఖాస్తుకు చివరి తేదీ ఈనెల 2వ తేదీ కాగా, దివ్యాంగ సంఘాల అభ్యర్థన మేరకు ఈ తేదీని 12కు పొడిగిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. కావున ఆసక్తి ఉండి, అర్హత కలిగినవారు https://tgobmms.cgg.gov.in/ApplicationFormERS.action వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News December 8, 2025
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

బాపట్ల కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ సమీక్షించనున్నట్లు ఆదివారం వివరించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరిస్తామని పేర్కొన్నారు. ప్రజలు అర్జీలు అందించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
News December 8, 2025
ADB: ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో లోకల్ హాలిడే

రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సూచన మేరకు, మూడు విడతలుగా జరిగే పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాలలో లోకల్ హాలిడే ఉంటుందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలియజేశారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఈనెల 11, 14, 17 తేదీలలో ప్రభుత్వ కార్యాలయాలు, లోకల్ బాడీ, ప్రభుత్వ సంస్థలే కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించారు.
News December 8, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 08, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.17 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.34 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.59 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


