News February 1, 2025
జగిత్యాల: దివ్యాంగుల దరఖాస్తుల తేదీ పొడిగింపు..!

జిల్లాలోని దివ్యాంగుల ఉపాధి, పునరావాస పథకం 2024-25 దరఖాస్తుకు చివరి తేదీ ఈనెల 2వ తేదీ కాగా, దివ్యాంగ సంఘాల అభ్యర్థన మేరకు ఈ తేదీని 12కు పొడిగిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. కావున ఆసక్తి ఉండి, అర్హత కలిగినవారు https://tgobmms.cgg.gov.in/ApplicationFormERS.action వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News February 19, 2025
పాలకొండకు జగన్ రాక రేపు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వైసీపీ అధినేత జగన్ రానున్నారు. ఇటీవల జడ్పీ మాజీ ఛైర్మన్ పాలవలస రాజశేఖరం చనిపోయారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ పాలకొండకు గురువారం రానున్నారు. ఈ మేరకు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఓ ప్రకటన విడుదల చేశారు. జగన్ పర్యటన విజయవంతం చేయాలని ఆమె కోరారు.
News February 19, 2025
ఎస్ఆర్ఎస్పీ కాల్వకు భూసేకరణ పూర్తి: మంత్రి పొంగులేటి

పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, కూసుమంచి మండలాలకు సంబంధించి SRSP 54 ప్యాకేజీ కాల్వలకు పూర్తి స్థాయిలో భూసేకరణ పూర్తి చేసినట్లు మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ భూసేకరణతో పూర్తి స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించటానికి మార్గం సులభం అవుతుందన్నారు. రైతులు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News February 19, 2025
పమిడిముక్కలలో యాక్సిడెంట్.. యువతి మృతి

పమిడిముక్కల మండలం తాడంకి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి నర్రా లక్ష్మీ ప్రసన్న (20) అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. మచిలీపట్నానికి చెందిన లక్ష్మీ ప్రసన్న తాడిగడపలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీసీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడి బైక్‌పై ఆమె మచిలీపట్నానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టారు. సీఐ చిట్టిబాబు కేసు నమోదు చేశారు.