News March 24, 2025

జగిత్యాల: ధరణి సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

image

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో ఆర్డీవోలు, తహసిల్దార్ లతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలాల వారిగా ధరణి దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో వున్న అన్ని దరఖాస్తులను ఈ నెల చివరి వరకు పూర్తి చేయాలన్నారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ తదితరులున్నారు.

Similar News

News December 8, 2025

చౌటుప్పల్ సమీపంలో భారీగా మద్యం పట్టివేత

image

చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం జాతీయ రహదారిపై ఎన్నికల వేళ అక్రమంగా తరలిస్తున్న రూ. 70 వేల విలువైన మద్యాన్ని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి, కారును సీజ్ చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

News December 8, 2025

ప.గో: బాలికలపై టీచర్ లైంగిక వేధింపులు..!

image

విద్యార్థినులను ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భీమవరం మండలం గొల్లవానితిప్ప ఉన్నత పాఠశాల బాలికలను మ్యాథ్స్ టీచర్ లైంగికంగా వేధించినట్లు తెలియడంతో తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా నిర్వహించిన PTMలో తల్లిదండ్రులు అధికారులకు వివరించారు. చట్టపరంగా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

News December 8, 2025

సమ్మిట్ గెస్టుల కోసం తెలంగాణ చిరుతిళ్లు

image

TG: ఈరోజు, రేపు జరగనున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే అతిథుల కోసం తెలంగాణ స్పెషల్ వంటకాలు సిద్ధం చేస్తున్నారు. చిరుతిళ్లతో కూడిన ప్రత్యేక డైట్ కిట్‌ను వారికి అందజేయనున్నారు. అందులో సకినాలు, నువ్వుల లడ్డూ, గారెలు, ఇప్పపువ్వు లడ్డూ, మక్క పేలాలు ఉన్నాయి. ఇక లంచ్‌లో హైదరాబాద్ దమ్ బిర్యానీ, పాయా, మటన్ కర్రీ, విదేశీ ప్రతినిధుల కోసం ఆయా దేశాల వంటలను రెడీ చేస్తున్నారు.