News February 3, 2025
జగిత్యాల: నక్ష.. పైలెట్ ప్రాజెక్ట్‌గా జగిత్యాల మున్సిపాలిటీ

కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన నక్ష అనే కార్యక్రమానికి పైలెట్ ప్రాజెక్ట్ కింద జగిత్యాల మున్సిపాలిటీ ఎంపికైందని భూ కొలతల శాఖ AD వెంకట్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో 5 మున్సిపాలిటీలు, 380 గ్రామాలున్నాయని.. మొదట జగిత్యాల పట్టణానికి నక్ష వేసిన అనంతరం జిల్లా మొత్తం సర్వే చేయనున్నట్లు చెప్పారు. జగిత్యాల బల్దియాలో హెలికాప్టర్లతో సర్వే చేస్తామన్నారు. మున్సిపాలిటీలోని భవనాలను డ్రోన్లతో సర్వే చేస్తామన్నారు.
Similar News
News March 14, 2025
మార్చి 14: చరిత్రలో ఈ రోజు

* 1879: భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జననం
* 1883: రాజకీయ-ఆర్థికవేత్త కార్ల్ మార్క్స్ మరణం
* 1890: మలయాళ పత్రిక ‘మలయాళ మనోరమ’ సర్క్యులేషన్ ప్రారంభం
* 1918: సినీ సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ జననం
* 1931: తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’ ముంబైలో విడుదల
* 1965: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ జననం
* 2018: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణం
News March 14, 2025
ADB: మూడు రోజులు కొనుగోళ్లు బంద్

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ పరిధిలో కందులు, శనగ కొనుగోళ్లను మూడు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆదిలాబాద్ సెంటర్ ఇన్‌ఛార్జ్ కేంద్రే పండరీ తెలిపారు. శుక్రవారం హోలీ పండుగ, ఆదివారం రావడంతో కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరిగి ఈ నెల 17 నుంచి కొనుగోళ్లు యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. రైతులు గమనించాలని కోరారు.
News March 14, 2025
చిత్తూరు: శక్తి టీంలను వెంటనే ఏర్పాటు చేయాలి

జిల్లా అంతట శక్తి టీంలను వెంటనే ఏర్పాటు చేయాలని ఎస్పీ మణికంఠ ఆదేశించారు. సిబ్బందితో నేర సమీక్ష సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్లతో నిఘా పెంచాలని సూచించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలను చైతన్య పరచాలన్నారు. అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలన్నారు.