News March 5, 2025

జగిత్యాల: నేడే పరీక్షలు.. ALL THE BEST

image

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 14,450 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఫస్టియర్ 7,073, సెకండియర్‌లో 7,377 మంది విద్యార్థులు రాయనుండగా.. 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో BNS 163(144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక నిమిషం ఆలస్యాన్ని తాజాగా 5 నిమిషాలకు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ALL THE BEST

Similar News

News December 6, 2025

విమాన టికెట్ ధరలు పెంచకూడదు: కేంద్ర మంత్రి

image

విమానయాన రంగంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ అధికారులతో కలిసి ఇండిగో సంస్థ కార్యకలాపాలను సమీక్షించారు. ఇండిగో సంస్థ తమ సేవలను వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తెచ్చుకోవాలని, టికెట్ ఛార్జీలను పెంచరాదని మంత్రి ఆదేశించారు.

News December 6, 2025

అనంత: చలిమంట కాచుకుంటూ వ్యక్తి మృతి

image

డి.హిరేహాల్ మండల కేంద్రంలో చలిమంట కాచుకుంటూ ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సిద్దేశ్ గత నెల 30న చలిమంట కాచుకుంటూ ఉండగా మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News December 6, 2025

ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్ ప్రతీక్ జైన్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎన్నికల నియమావళిని పాటిస్తూ సరైన విధంగా నిర్వహించాలని అధికారులను వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ మూడు దశలు పూర్తయ్యే వరకు ఎన్నికల నియమావళి(కోడ్) అమలులో ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.