News February 27, 2025
జగిత్యాల: నేడే పోలింగ్.. అంతా రెడీ!

నేడు జరగనున్న KNR, MDK, ADB, NZB పట్టభద్రుల, టీచర్ MLC ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. పట్టభద్రులు 35,281, ఉఫాధ్యాయులు 1,769 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రుల కోసం 51, ఉపాధ్యాయుల కోసం 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల బరిలో 56 మంది, ఉపాధ్యాయ స్థానంలో 15 మంది ఉండగా.. ఎవరు విజేతగా నిలుస్తారో మార్చి 3వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.
Similar News
News December 9, 2025
నేషనల్ కెమికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

పుణేలోని CSIR-నేషనల్ కెమికల్ లాబోరేటరీలో 34 టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12 నుంచి జనవరి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. టెక్నీషియన్‌కు నెలకు రూ.40వేలు, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.72,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: http://recruit.ncl.res.in/
News December 9, 2025
చంద్రబాబు ఎప్పటికీ రైతు వ్యతిరేకే: పేర్ని నాని

AP: వ్యవసాయం, ధాన్యాగారంగా APకి ఉన్న బ్రాండును దెబ్బతీసింది CM చంద్రబాబేనని మాజీమంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రైతును గుడ్డికన్నుతో చూడటం చంద్రబాబు విధానం. ఆయన ఎప్పటికీ రైతు వ్యతిరేకే. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు. 18నెలల్లోనే రూ.2.66లక్షల కోట్ల అప్పుచేశారు. అప్పులు తెచ్చి ఎక్కడ పెడుతున్నారు? దేశ GDPలో AP వాటా ఎంత?’ అని ప్రశ్నించారు.
News December 9, 2025
ప్రకాశం డీఈవో కిరణ్ కుమార్ బదిలీ

ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఈవోల సాధారణ బదిలీలలో ప్రకాశం జిల్లా డీఈవో కిరణ్ కుమార్ గుంటూరు జిల్లా బోయపాలెం డైట్ కళాశాలకు బదిలీ కాగా, ఆయన స్థానంలో గుంటూరు జిల్లా డీఈవో సీవీ రేణుక నియమితులయ్యారు. త్వరలోనే ప్రకాశం డీఈవోగా రేణుక బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.


