News February 21, 2025

జగిత్యాల: నేరం చేస్తే శిక్ష తప్పదు: ఎస్పీ

image

జిల్లాలోని గడిచిన రెండు నెలల్లో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న 14 మందికి జైలు శిక్షలు పడే విధంగా కృషి చేసిన పీపీలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అభినందించి ప్రశాంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతటి వారైనా నేరం చేస్తే శిక్ష తప్పదని అన్నారు. నేరస్థులకు శిక్ష పడేలా చేయడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకరావచ్చన్నారు.

Similar News

News February 22, 2025

సంగారెడ్డి: ఈనెల 24న పదో తరగతి పరీక్షలపై శిక్షణ

image

మార్చి నెలలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై ఎంఈవోలకు, రూట్ ఆఫీసర్లకు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరిండెంటెంట్, డిపార్ట్మెంట్లకు ఈనెల 24న జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో ఉదయం 10 గంటలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ శిక్షణలో జిల్లా కలెక్టర్ పాల్గొంటారని చెప్పారు.

News February 22, 2025

మత్స్యకారులు పథకాలు ఉపయోగించుకోవాలి: కలెక్టర్

image

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అమలవుతున్న పథకాలను కృష్ణా జిల్లాలోని మత్స్యకారులు, ఆక్వా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీ.కే.బాలాజి కోరారు. కలెక్టరేట్‌లో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సహకారంతో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజ పథకం వినియోగంపై శనివారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు ఇచ్చారు.

News February 22, 2025

కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్ (2/2)

image

✓ కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ కు ఏం తెచ్చడో చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
✓ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
✓ చొప్పదండి: దాడి చేసిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు
✓ ఇల్లందకుంట: పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టిన తెలంగాణ ఉద్యమకారులు
✓ చిగురుమామిడి: యూరియాపై వస్తున్న వదంతులు నమ్మొద్దు: మండలం వ్యవసాయ అధికారి రాజుల నాయకుడు
✓ మొలంగూర్ లో క్షయ వ్యాధి నివారణ మొబైల్ క్యాంప్

error: Content is protected !!