News February 15, 2025

జగిత్యాల: నోడల్ అధికారులకు కలెక్టర్ సూచనలు

image

ఎమ్మెల్సీ పోలింగ్ విధులపై నోడల్ అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ నెల 26న ఉదయం 8 గంటలకు ప్రిసైడింగ్ అధికారులు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోని పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్స్‌లను క్షుణ్ణంగా పరిశీలించాలని, సంయమనంతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

Similar News

News July 6, 2025

NZB: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలి

image

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. నిధులు దుర్వినియోగం అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు.

News July 6, 2025

అనంతగిరిగా మార్చాలని డిమాండ్.. మీ కామెంట్ ?

image

వికారాబాద్ జిల్లాలో మరో కొత్త డిమాండ్ వినిపిస్తోంది. చుట్టు అడవి, గుట్టమీద అనంత పద్మనాభస్వామి కొలుదీరిన ప్రాంతానికి అనంతగిరి జిల్లాగా పేరు మార్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అనంతగిరి గుట్టల ప్రకృతి సోయగాలు, మూసీ నది జన్మస్థలం, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఎంతో ప్రసిద్ధి చెందటంతో జిల్లా పేరు మార్చాలని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనిపై మీ కామెంట్.

News July 6, 2025

భద్రాద్రి రామయ్యకు స్వర్ణతులసి పూజలు

image

శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అర్చకులు శనివారం స్వర్ణతులసి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి సుప్రభాతం పలికి ఆరాధన, ఆరగింపు, సేవాకాలం, నిత్యహోమాలు, నిత్యబలిహరణం తదితర నిత్యపూజలు చేశారు. స్వామివారి నిత్యకళ్యాణ మూర్తులను బేడా మండపానికి తీసుకువచ్చి నిత్యకళ్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.