News March 11, 2025

జగిత్యాల: ‘పంటలు కాపాడేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి’

image

పంటలు కాపాడేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. యాసంగి సాగు నీటి సరఫరాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి తో కలిసి జిల్లా కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ లో జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 18, 2026

NGKL: మున్సిపల్ ఎన్నికలు.. అభ్యర్థుల అర్హతలు

image

2026 మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులకు అధికారులు నిబంధనలు ఖరారు చేశారు. అభ్యర్థి 21 ఏళ్లు నిండిన భారత పౌరుడై ఉండాలి. సంబంధిత మున్సిపాలిటీలో ఓటరుగా ఉండాలి. పార్టీ అభ్యర్థికి ఒకరు, స్వతంత్రులకు 10 మంది ప్రపోజర్లు అవసరం. ఖర్చు పరిమితి రూ.2 లక్షల- రూ.10 లక్షల వరకు ఉంటుంది. ప్రతి ఖర్చును రిజిస్టర్‌లో నమోదు చేయడం తప్పనిసరి.

News January 18, 2026

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. నేషనల్ పార్కు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిన్న నలుగురు, ఇవాళ ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలంలో AK-47 సహా 6 తుపాకులు, పేలుడు పదార్థాలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

News January 18, 2026

తూ.గో: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కొవ్వూరు మండలం దేచర్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మట్ట సత్యనారాయణ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. పంగిడి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సత్యనారాయణతో పాటు ఉన్న కోటి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు క్రషర్ కార్మికుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. సత్యనారాయణకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.