News March 15, 2025
జగిత్యాల: పండుగ పూట విషాదం.. నలుగురి మృతి

ఉమ్మడి KNR జిల్లాలో నిన్న వేర్వేరు ఘటనలో 4గురు చనిపోయారు. JGTL రూరల్(M) వెల్దుర్తిలోని కెనాల్‌లో <<15761461>>ఈతకు<<>> వెళ్లి సాగర్‌గౌడ్ చనిపోయాడు. KNR జిల్లా ఇల్లందకుంట(M) చిన్నకోమటిపల్లిలో బైక్ అదుపుతప్పి JMKTకు చెందిన అనుదీప్ మృతిచెందాడు. PDPL జిల్లా కమాన్‌పూర్(M) గుండారానికి చెందిన ఓదెలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. SRCL జిల్లా చందుర్తికి చెందిన వామిక అనే 16 నెలల చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది.
Similar News
News March 6, 2026
NZB: తెలంగాణ ప్రజలు మోదీ పాలన కోరుకుంటున్నారు: ఈటెల

తెలంగాణ ప్రజలు మోదీ పాలన కోరుకుంటున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. నిజామాబాద్ శివారులోని కమ్మ సంఘం భవనంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఆత్మీయ అభినందన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో భవిష్యత్ బీజేపీదేనని అన్నారు. నియంతృత్వ పాలన సాగించిన కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుందన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసి ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు.
News March 6, 2026
రక్త పరీక్షతో అల్జీమర్స్‌ను ముందే గుర్తించొచ్చు: వైద్యులు

ప్రస్తుతం చాలా మంది బాధపడే అల్జీమర్స్(మతిమరుపు) వ్యాధిని రక్త పరీక్ష ద్వారా ముందే గుర్తించవచ్చని న్యూరాలజిస్టులు చెబుతున్నారు. ‘అల్జీమర్స్ లక్షణాలు కనిపించడానికి 20 ఏళ్ల ముందే మెదడులో మార్పులు మొదలవుతాయి. వీటిని గుర్తించేందుకు రక్తంలోని ‘p-tau217’ ప్రొటీన్ ద్వారా వ్యాధి ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉందో ముందే అంచనా వేయవచ్చు. ఇది వ్యాధి ముదరకముందే చికిత్స అందించడానికి తోడ్పడుతుంది’ అని సూచిస్తున్నారు.
News March 6, 2026
HYDలో ఆకాశమే హద్దుగా హోర్డింగ్‌లు!

అడ్వర్టైజ్‌మెంట్ పాలసీలో మార్పులతో సిటీలో యాడ్ బోర్డుల గోల మొదలైంది. 6ఏళ్లుగా 15 ఫీట్ లిమిట్‌ను సర్కార్ సైలెంట్‌గా ఎత్తేసింది. GHMC, CMC, MMCల్లో ఇక ఆకాశమే హద్దుగా హోర్డింగ్‌లు వెలవనున్నాయి. పెద్ద కంపెనీలకు మేలు చేసేలా టెండర్ కండీషన్లు మార్చారని, చిన్న అడ్వర్టైజర్లు నష్టపోతారనే అరోపణలు ఉన్నాయి. 5ఏళ్ల కాంట్రాక్టుల పేరుతో రూ.కోట్లు ఆదాయానికి గండి కొట్టేలా తెర వెనుక పెద్ద స్కెచ్ నడిచిందని టాక్.


