News March 19, 2025
జగిత్యాల: పట్టాల రద్దు.. స్వచ్ఛందంగా భూములు అప్పగించిన రైతులు

జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్‌లో అసైన్డ్ భూముల వ్యవహారంలో 13 ఎకరాల 21 గుంటల అక్రమ పట్టాలను రద్దు చేశారు. 90 ఎకరాలకు పైగా భూమి చట్ట విరుద్ధంగా పట్టా పొందినట్లు తహశీల్దార్ నివేదికలో వెల్లడైంది. దీంతో కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశాలతో 15 మందికి నోటీసులు ఇచ్చారు. 13.21 ఎకరాలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు. ముగ్గురు రైతులు స్వచ్ఛందంగా 3.15 ఎకరాలను అప్పగించారు.
Similar News
News April 25, 2025
వడ్డీ రేట్లు తగ్గించిన మరో 2 బ్యాంకులు

ఇటీవల ఆర్బీఐ రెపో రేటును 0.25% తగ్గించడంతో ఆ మేర రుణ రేటును కుదించనున్నట్లు కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ప్రకటించాయి. దీంతో కెనరా బ్యాంకులో హౌస్ లోన్ కనీస రేటు 7.90%, వాహన రుణ రేటు 8.20% నుంచి ప్రారంభమవుతాయి. ఇండియన్ బ్యాంక్ గృహ రుణ రేటు 7.90%, వెహికల్ లోన్ రేటు 8.25% నుంచి మొదలవుతాయి. ఈ నెల 12 నుంచే ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి.
News April 25, 2025
గెస్ట్ లెక్చరర్ల సర్వీసు పొడిగింపు

AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్టు లెక్చరర్ల సర్వీసును ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ నెల 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 18 వరకు సేవలను వినియోగించుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో 957 మందికి లబ్ధి చేకూరనుంది. వేసవి సెలవుల అనంతరం వీరు క్లాస్‌లు తీసుకోనున్నారు.
News April 25, 2025
HYD స్థానిక ఎమ్మెల్సీ కౌంటింగ్ నేడే

AP: హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ఇవాళ ఉ.8కి మొదలవనుంది. మీర్జా రియాజ్(MIM), గౌతంరావు(BJP) పోటీలో ఉన్నారు. బుధవారం జరిగిన పోలింగ్‌లో 112 మందికి గాను 88 మంది ఓటు వేశారు. 45 ఓట్లు వచ్చినవారు విజేతగా నిలుస్తారు. MIMకు సింగిల్‌గానే 50 ఓట్లు ఉండటం, INC(14) కూడా మద్దతివ్వడంతో రియాజ్ గెలుపు లాంఛనమే. ఉ.10 గంటల్లోపే ఫలితం వెలువడనుంది. BRS సభ్యులు(24) ఓటింగ్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.