News March 20, 2025
జగిత్యాల: పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈఓ

జగిత్యాల జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధంచేసినట్లు జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 67 పరీక్ష కేంద్రాల్లో 11,855 మంది రెగ్యులర్ విద్యార్థులు, 285 మంది బ్యాక్లాగ్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని ఆయన అన్నారు. 826 ఇన్విజిలేటర్ల ఆధ్వర్యంలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Similar News
News December 3, 2025
ఇతిహాసాలు క్విజ్ – 85 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: పాండురాజు మరణానికి గల కారణం ఏంటి?
సమాధానం: పాండురాజు వేటకు వెళ్లినప్పుడు, జింకలుగా భావించి కిందమ అనే మహామునిపై బాణం వేస్తాడు. దీంతో ఆ ముని మరణిస్తూ పాండురాజు తన భార్యతో కలిసిన తక్షణమే మరణిస్తాడని శపిస్తాడు. ఈ శాపం కారణంగా, ఒకరోజు మాద్రితో కలిసినప్పుడు పాండురాజు తక్షణమే మరణించారు. దాంతో మాద్రి సహగమనం చేసింది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 3, 2025
జగిత్యాల: ‘ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు’

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై బుధవారం ఆమె కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జగిత్యాల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, ఎన్నికల పరిశీలకులు రమేష్, అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
News December 3, 2025
తూ.గో. హ్యాండ్ బాల్ టీమ్ ఎంపిక

సామర్లకోట మండలం పనసపాడులో బుధవారం తూర్పుగోదావరి జిల్లా హ్యాండ్బాల్ టీమ్ ఎంపిక జరిగింది. ఈ ఎంపిక ప్రక్రియలో 40 మంది క్రీడాకారులు పాల్గొనగా.. 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ తెలిపారు. ఎంపికైన ఈ జట్టు కర్నూలులో జరగనున్న అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటుందని ఆయన వెల్లడించారు. ఎంపికైన క్రీడాకారులకు ఇతర క్రీడాకారులు అభినందనలు తెలిపారు.


