News January 30, 2025
జగిత్యాల: పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సన్మానించిన జిల్లా ఎస్పీ

జగిత్యాల జిల్లా కేంద్రంలోని న్యాయస్థానంలో పనిచేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లను బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ శాలువాలతో సన్మానించారు. వివిధ కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు చేస్తున్న సేవలు మరువలేనివని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని న్యాయస్థానంలో పనిచేస్తున్న ఆరుగురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సన్మానించారు.
Similar News
News February 10, 2025
హత్నూర: దౌల్తాబాద్ విద్యార్థుల ప్రతిభ

హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్ లో అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ ఆదివారం నిర్వహించారు. హత్నూర మండలం దౌల్తాబాద్ 9వ తరగతి విద్యార్థులు నవాజ్, భవానీ, అన్విత క్రియ ఆర్టిజన్ స్పెక్ట్రమ్ డిజాస్టర్ నమూనాకు రూ. 30 వేల బహుమతి అందుకున్నారు. వీరిని జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. విద్యార్థులు, గైడ్ ఉపాధ్యాయుడు వెంకటేశంను కలెక్టర్ వల్లూరు క్రాంతి అభినందించారు.
News February 10, 2025
ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్స్‌లో మందమర్రి బాలుడు

హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం న్యూ డ్రాగన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్స్‌లో మందమర్రికి చెందిన బిఎంఆర్ కరాటే అకాడమీ విద్యార్థి సత్తా చాటారు. అండర్14 కటాస్ విభాగంలో జి. సాయి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు భానుచందర్, బిఎంఆర్ అకాడమీ నిర్వాహకులు సంతోష్, మాస్టర్ కర్ర వెంకటేష్, శశి అభినందించారు.
News February 10, 2025
ధర్మార: ప్రియురాలు నో చెప్పిందని యువకుడు సూసైడ్

ధర్మారం మండలం ఖానంపల్లి గ్రామానికి చెందిన గడ్డం అజయ్ (22) తాను ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోను అని అనడంతో మనస్తాపం చెంది గతనెల 29న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా,చికిత్స పొందుతూ అజయ్ ఆదివారం మృతిచెందినట్లు ధర్మారం SI శీలంలక్ష్మణ్ తెలిపారు. అజయ్ తండ్రి గడ్డం ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.