News January 28, 2025

జగిత్యాల: పరంపోగు భూమిని కబ్జా చేశారు!

image

జిల్లాలోని పలువురు వివిధ రకాల సమస్యల్ని జగిత్యాల కలెక్టర్ ముందు ఉంచారు. రైతుభరోసాపై జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామస్థులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామంలో పరంపోగు భూమిని కబ్జాచేశారని ఒకరు ఫిర్యాదు చేశారు. పోరుమల్ల గ్రామానికి ఎస్సీ రిజ్వరేషన్ ఇవ్వాలని ఫిర్యాదు చేశారు.

Similar News

News October 24, 2025

ఓయూ: MA ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని MA ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూడొచ్చని సూచించారు.

News October 24, 2025

మెదక్: విషాదం.. మృతదేహాల కోసం ఎదురుచూపు..!

image

మెదక్ మండలం <<18091691>>శివ్వాయిపల్లికి చెందిన<<>> మంగ సిద్ధగౌడ్‌కు ఆనంద్ గౌడ్, రమేశ్ గౌడ్ ఇద్దరు కుమారులు, ఒక కూతురు. ఆనంద్ గౌడ్ దుబాయ్‌లో ఉద్యోగరీత్యా స్థిరపడగా అతడికి పాపన్నపేటకు చెందిన సంధ్యారాణితో వివాహమైంది. వీరికి కుమార్తె చందన(23) బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. కుమారుడు శ్రీవల్లభ గౌడ్ అలహాబాద్‌లో చదువుతున్నాడు. తల్లీకూతుళ్లు కర్నూల్ వద్ద బస్సులో సజీవ దహనం కాగా మృతదేహాల కోసం ఎదురుచూస్తున్నారు.

News October 24, 2025

మెట్పల్లి నుంచి అరుణాచల గిరిప్రదక్షిణకు బస్సు

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 5న జరగనున్న అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం మెట్పల్లి డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు నవంబర్ 3న మధ్యాహ్నం 2 గంటలకు మెట్పల్లి బస్ స్టేషన్ నుంచి బయలుదేరి మార్గమధ్యంలో కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనాల అనంతరం నవంబర్ 4 రాత్రికి అరుణాచలం చేరుతుందని, 5న దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం అవుతుందని చెప్పారు.