News January 28, 2025

జగిత్యాల: పరంపోగు భూమిని కబ్జా చేశారు!

image

జిల్లాలోని పలువురు వివిధ రకాల సమస్యల్ని జగిత్యాల కలెక్టర్ ముందు ఉంచారు. రైతుభరోసాపై జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామస్థులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామంలో పరంపోగు భూమిని కబ్జాచేశారని ఒకరు ఫిర్యాదు చేశారు. పోరుమల్ల గ్రామానికి ఎస్సీ రిజ్వరేషన్ ఇవ్వాలని ఫిర్యాదు చేశారు.

Similar News

News February 16, 2025

MPTC, ZPTC ఎన్నికలు: రంగారెడ్డి జిల్లా UPDATES

image

రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2025కు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉన్నాయి. 1,358 పోలింగ్ కేంద్రాలను ఫైనల్ చేశారు. మొత్తం 232 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 7,63,603 ఓటర్లు ఉన్నారు.

News February 16, 2025

సిరిసిల్ల: బహుమతులతో సత్కారం: కలెక్టర్

image

సిరిసిల్ల పట్టణంలో అధ్యాపకులు, ఆస్పత్రి సిబ్బంది, వైద్య విద్యార్థులకు ఆటల పోటీలు, దాండియా, ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రావీణ్యం కనబరిచిన వారిని బహుమతులతో సత్కరించామని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. విద్యార్థులు నాణ్యమైన విలువలతో కూడిన వైద్య విద్య నేర్చుకొని భవిష్యత్తులో మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించాలని సూచించారు.

News February 16, 2025

కాటారం సబ్ డివిజన్ అడవుల్లో పెద్దపులి!

image

కాటారం సబ్ డివిజన్ పరిధిలోని అడవుల్లో పెద్దపులి సంచారం కలవరపెడుతోంది. వారం రోజులుగా 15 కిలోమీటర్ల రేడియస్‌లోని అడవుల్లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అటవీ అధికారులు పులి జాడ కోసం అడవి అంతా జల్లెడ పడుతున్నారు. మహాదేవపూర్ మండలం అన్నారం అడవుల్లో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్లొద్దని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.

error: Content is protected !!