News January 26, 2025

జగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఉత్తమ సేవలు అందించిన పలువురికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు, ఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులున్నారు.

Similar News

News December 6, 2025

కుల్కచర్ల: రాతపూర్వక హామీ ఇస్తేనే సర్పంచ్ పదవి !

image

కుల్కచర్ల మండలంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం సరికొత్త మలుపు తిరిగింది. నామినేషన్లు దాఖలు చేసిన 338 మంది అభ్యర్థులకు ఓటర్ల నుంచి ఊహించని డిమాండ్ ఎదురవుతోంది. ఎన్నికల హామీలను ఇకపై కేవలం మాటల్లో చెబితే నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెబుతున్నారు. గ్రామ అభివృద్ధికి హామీలను పేపర్‌పై రాసి ఇస్తేనే సర్పంచ్‌ పదవి దక్కుతుందని స్పష్టం చేస్తున్నారు. దీంతో రాతపూర్వక హామీలపై అభ్యర్థులు తర్జనభర్జన పడుతున్నారు.

News December 6, 2025

రేపు డయాలసిస్ కేంద్రాలకు భూమిపూజ: కేంద్రమంత్రి వర్మ

image

భీమవరం, ఆచంటలో రేపు డయాలసిస్ కేంద్రాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నామని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజురోజుకీ పెరుగుతున్న డయాలసిస్ రోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని, నరసాపురం పార్లమెంట్ పరిధిలో అత్యాధునిక డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సుమారు రూ.10కోట్ల CSR నిధులను వెచ్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.

News December 6, 2025

సమాచార హక్కు చట్టం.. సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం: కలెక్టర్

image

ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 20 సంవత్సరాల వేడుకలు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించారు. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి అయిందని, సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం అన్నారు. అధికారులు నిర్ణీత సమయంలో సమాచారం ఇవ్వాలని నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే పరిస్థితి సీరియస్ అవుతుందని పేర్కొన్నారు.