News March 21, 2025
జగిత్యాల: పసుపు ధరలతో రైతన్నల్లో నిరాశ!

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో పసుపు ధరలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. గురువారం పసుపు గోళ గరిష్ఠ ధర క్వింటాకు రూ.8,525, కనిష్ఠ ధర రూ. 5,000, పసుపు కాడి గరిష్ఠ ధర రూ. 9,800, కనిష్ఠ ధర రూ.6,350లుగా పలికాయి. చూర రకం పసుపు ఇంకా మార్కెట్కు రావడం లేదు. అయితే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ధరలు చాలా తక్కువేనని రైతులు చెబుతున్నారు. ఊహించిన ధరలు రాకపోవడంతో నిరాశతో ఉన్నారు.
Similar News
News October 15, 2025
బల్కంపేట ఎల్లమ్మ గుడి సిబ్బందికి వాకీటాకీలు

బల్కంపేట ఎల్లమ్మ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. దీంతో వీరిని అదుపు చేసేందుకు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఒకరికొకరు సమాచారం అందించుకోవడానికి ఇబ్బందులెదురయ్యేవి. ఈ సమస్యకు అధికారులు పరిష్కారం చూపారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వాకీటాకీలు అందజేశారు. వీటి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందజేయవచ్చు. దీంతో భక్తుల ఇక్కట్లకు ఫుల్స్టాప్ పడనుంది.
News October 15, 2025
సిద్దిపేట: ‘బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి’

దీపావళి సందర్భంగా బాణాసంచా విక్రయించే షాపులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ఎస్.ఎం. విజయ్ కుమార్ సూచించారు. అనుమతులు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసినా, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా, విక్రయాలు జరిపినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 15, 2025
కార్తిక సోమవారం.. పంచారామాలకు ప్రత్యేక బస్సు

ఖమ్మం: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం RTC ఖమ్మం విభాగం ప్రత్యేక సర్వీసును ప్రకటించింది. ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి అమరావతి, భీమవరం, ద్రాక్షారామం, పాలకొల్లు, సామర్లకోటకు సూపర్ లగ్జరీ బస్సు నడుపుతోంది. ఈ నెల 26న రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరుతుంది. టికెట్ ధర పెద్దలకు రూ.2,300, పిల్లలకు రూ.1,200గా నిర్ణయించామని, వివరాలకు 91364 46666 నెంబర్ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.