News February 14, 2026
జగిత్యాల: పార్టీ నిరాకరించినా.. ప్రజలు మాత్రం ప్రజా సేవకులకే పట్టం

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో 22వ వార్డు బీజేపీ టికెట్ ఆశించిన ఆరవ లక్ష్మి (బిట్టు), 26వ వార్డు బీజేపీ సిట్టింగ్ కౌన్సిలర్ పులి రమ (శ్రీధర్) టికెట్ దక్కక ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఘన విజయం సాధించారు. బీజేపీ టికెట్‌ను వేరే వారికి కేటాయించడంతో వీరి కుమారులు కన్నీరు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. పార్టీ నిరాకరించినా ప్రజలు మాత్రం ప్రజా సేవకులను ఆదరిస్తారు అనే దానికి ఇదే నిర్వచనం.
Similar News
News March 12, 2026
భద్రాచలం. ‘శ్రీరామనవమి వేడుకలు.. బస్సులు కొరత ఉండొద్దు’

భద్రాచలం ఐటీడీఏ గిరిజన భవన్‌లో శ్రీరామనవమి వేడుకలపై TSRTC సమీక్ష సమావేశం జరిగింది. కరీంనగర్ డిపో మేనేజర్ సాల్మన్ ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడుతూ.. ఈ నెల 27, 28న స్వామివారి కళ్యాణానికి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో బస్సులు నడపాలని సూచించారు. సమావేశంలో భద్రాచలం డిపోతో పాటు ఆరు డిపోల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.
News March 12, 2026
ముత్యాలమ్మ జాతరలో డ్రోన్లతో నిఘా

తూర్పు కనుపూరు ముత్యాలమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నిరంతరం డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచామని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. కమాండ్ కంట్రోల్ సీసీ టీవీ ఫుటేజ్‌తో పాటు డ్రోన్ల పర్యవేక్షణ కొనసాగించారు. జాతరలో అసాంఘిక కార్యక్రమాలు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వంటివి జరగకుండా అరికట్టారు.
News March 12, 2026
శ్రీకాకుళం: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా గురువారం తెలిపారు. ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ లోక్ అదాలత్‌కు సంబంధించి జిల్లాలో 11,602 కేసులు గుర్తించడమైనదని, జిల్లా మొత్తం మీద 20 బెంచ్‌లు ఏర్పాటు చేయగా, జిల్లా కేంద్రంలో 4 బెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.


