News April 19, 2025

జగిత్యాల: పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టండి: ఎస్పీ

image

గ్రామాల్లో చెరువులు, కుంటలు, బావులల్లో ఈతకు వెళ్లే పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. శనివారం జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. సరదా కోసం ఈతకు వెళ్తే కొందరు ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు జరిగాయని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా ఈత నేర్చుకునే పిల్లలు తల్లిదండ్రులతో వెళ్ళాలన్నారు.

Similar News

News February 22, 2026

T20 WC: SAతో మ్యాచుకు భారత జట్టు ఇదేనా?

image

సూపర్-8లో ఇవాళ SAతో మ్యాచులో IND ప్లేయింగ్-11 ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. అభిషేక్‌ను తొలగిస్తారని, తిలక్ స్థానంలో శాంసన్ ఆడిస్తారన్న వార్తలను కెప్టెన్ సూర్య ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కొట్టిపారేశారు. దీంతో వారిద్దరూ ఆడతారని కన్ఫర్మ్ అయింది. సుందర్ స్థానంలో అక్షర్ టీమ్‌లోకి రావొచ్చు.
ప్లేయింగ్11(అంచనా): సూర్య, అభిషేక్, ఇషాన్, తిలక్, హార్దిక్, అక్షర్, దూబే, రింకు, వరుణ్, బుమ్రా, అర్ష్‌దీప్.

News February 22, 2026

సింగరాయకొండ వద్ద ఘోర ప్రమాదం

image

ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కందుకూరు ఫ్లైఓవర్ మీద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు వైపు వెళ్తున్న కంటైనర్ బాక్స్ లారీని పుచ్చకాయ లోడ్‌తో వెళ్తున్న మినీ వ్యాన్ వెనుక వైపు నుంచి ఢీకొంది. దీంతో మినీ వ్యాన్ డ్రైవర్ అక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. మృతుడు గుంటూరు జిల్లా తెనాలి పరిధిలోని నందివెలుగుకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

News February 22, 2026

కావలి: దైవ దర్శనాకి వెళ్లి ఒకరి మృతి

image

దైవ దర్శనానికి వెళ్తూ ఒకరు మృతి చెందిన ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. కావలికి చెందిన పురుషోత్తం(60) ఆత్రేయపురం మండలం వాడపల్లి ఏడువారాల వేంకన్నను దర్శించుకోవాలని రాజమండ్రికి వెళ్లారు. అక్కడ నుంచి ఆటోలో ఆలయానికి బయలుదేరగా RTC బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని నలుగురికి గాయాలయ్యాయి. పురుషోత్తం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆత్రేయపురం SI కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.