News February 9, 2025

జగిత్యాల: పీఎంఈజీసీ రుణాల పేరుతో మోసం.. అరెస్టు

image

ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రాం కింద సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానని జగిత్యాల జిల్లాలో వేణు వర్మ అనే యువకుడు పలువురి నుంచి లక్షల్లో వసూలు చేశాడు. మంచిర్యాల జిల్లా హజీపూర్కు చెందిన వేణు వర్మను బాధితులు శనివారం JGTL పట్టణంలోని తీన్ ఖని ప్రాంతంలో పట్టుకుని జగిత్యాల టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 15, 2025

UN HRC మెంబర్స్‌గా ఇండియా, పాకిస్థాన్

image

ఐక్యరాజ్య సమితి 2026-28కి గాను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌ను ఎన్నుకుంది. మెంబర్స్‌గా అంగోలా, చిలీ, ఈక్వెడార్, ఈజిప్ట్, ఎస్టోనియా, ఇండియా, ఇరాక్, ఇటలీ, మారిషస్, పాక్, స్లోవేనియా, SA, UK, వియత్నాంను ఎన్నుకుంది. నిత్యం మానవ హక్కులను కాలరాసే పాక్‌లాంటి దేశానికి UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌లో చోటు దక్కడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది సరైన నిర్ణయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News October 15, 2025

ఈ నెల 16న నిర్మల్‌లో జాబ్ మేళా

image

ఈ నెల 16న నిర్మల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి గోవింద్ తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలలో ఖాళీలు ఉన్నాయన్నారు. దాదాపు 68 ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News October 15, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 15, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.09 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.02 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.17 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.54 గంటలకు
✒ ఇష: రాత్రి 7.07 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.