News February 9, 2025
జగిత్యాల: పీఎంఈజీసీ రుణాల పేరుతో మోసం.. అరెస్టు

ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రాం కింద సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానని జగిత్యాల జిల్లాలో వేణు వర్మ అనే యువకుడు పలువురి నుంచి లక్షల్లో వసూలు చేశాడు. మంచిర్యాల జిల్లా హజీపూర్కు చెందిన వేణు వర్మను బాధితులు శనివారం JGTL పట్టణంలోని తీన్ ఖని ప్రాంతంలో పట్టుకుని జగిత్యాల టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 10, 2026
నిర్మల్: ప్రచార హోరు.. ఇక డిజిటల్ జోరు

మున్సిపల్ ఎన్నికల బహిరంగ ప్రచారానికి తెరపడటంతో అభ్యర్థుల దృష్టి సోషల్ మీడియాపై పడింది. నిబంధనల ప్రకారం బహిరంగ సభలు, ర్యాలీలకు సమయం ముగియడంతో ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను వేదికగా చేసుకున్నారు. తమ ప్రాధాన్యతలు, గత అభివృద్ధి పనుల వీడియోలు, ఆకర్షణీయమైన ఫ్లెక్సీలను షేర్ చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా ఇంటింటికీ చేరుతూ మద్దతు కోరుతున్నారు.
News February 10, 2026
HYD: చనిపోయినా పెన్షన్ ఇస్తాం.. వాడుకోండి

‘అయ్యో! మీరు చనిపోయారా.. ఏం పర్లేదు మీ పెన్షన్ డబ్బులు ఆగిపోవు.. మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. మీరు ఏ లోకంలో ఉన్నా వాడుకోవచ్చు’ ఇది సర్కారు తీరు. ఫతుల్లాగూడకు చెందిన జంగయ్య, బండ్లగూడకు చెందిన పోచయ్యలు ఎప్పుడో చనిపోయారు. అయినా వారి అకౌంట్లలో వృద్ధాప్య పెన్షన్ పడుతోంది. త్యాయగరాయనగర్‌కు చెందిన వీరభద్రయ్య(దివ్యాంగుడు) చనిపోయినా 5ఏళ్లుగా నెలకు రూ.4,016 జమ అవుతోందంటే మన అధికారుల తీరు అర్థం చేసుకోవచ్చు.
News February 10, 2026
ప్రైవేటుకు 4 NHలు.. జాబితాలో ఏపీ హైవే

AP: నాలుగు రాష్ట్రాల్లోని 260 కి.మీ పొడవైన 4 జాతీయ రహదారులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. వీటికి రూ.9,500 కోట్లు చెల్లిస్తామని RIIT చేసిన ఆఫర్‌కు NHAI ఆమోదం తెలిపింది. ఇందులో 69 కి.మీ పొడవైన విజయవాడ-చిలకలూరిపేట హైవే కూడా ఉంది. మిగిలిన రహదారులు తమిళనాడు, కర్ణాటక, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఉన్నాయి.


