News March 3, 2025

జగిత్యాల: పీస్ కమిటీ మెంబర్లతో డీఎస్పీ సమావేశం

image

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల డీఎస్పీ రఘు చందర్, జగిత్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ఎస్ వేణుగోపాల్‌లు సోమవారం జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముస్లిం మత పెద్దలను, పీస్ కమిటీ మెంబర్లను పిలిపించి మాట్లాడారు.

Similar News

News December 3, 2025

ఖమ్మం జిల్లాలో 6 బయో-ఇన్‌పుట్ సెంటర్లు

image

రాష్ట్రంలో సేంద్రీయ సాగు ప్రోత్సాహకానికి 250 బయో-ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్‌లను గుర్తించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ తెలిపారు. లోక్‌సభ సమావేశాల్లో ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. జిల్లాలో ఇటువంటి కేంద్రాలు ఆరు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకుబీజామృత్, జీవామృత్, నీమాస్త్రం వంటి సేంద్రీయ ఎరువులను అందిస్తున్నట్లు వెల్లడించారు.

News December 3, 2025

నామినేషన్ల కేంద్రాలను తనిఖీ చేసిన ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ బుధవారం పరిశీలించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆమె తనిఖీ చేశారు. నామినేషన్‌తోపాటు అభ్యర్థి నూతన బ్యాంక్ ఖాతా కచ్చితంగా కలిగి ఉండాలని, అన్ని వివరాలు నింపాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సూచించారు. హెల్ప్ డెస్క్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

News December 3, 2025

కొమురవెల్లి మల్లన్న మూలవిరాట్ దర్శనం తాత్కాలిక నిలిపివేత

image

కొమురవెల్లి శ్రీ మల్లన్న దేవాలయంలో డిసెంబర్ 7 సాయంత్రం 8.30 గంటల నుంచి డిసెంబర్ 14 ఉదయం 6 గంటల వరకు మూలవిరాట్ దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ వర్గాలు ప్రకటించాయి. డిసెంబర్ 14న స్వామివారి కల్యాణోత్సవ సందర్భంగా గర్భాలయంలోని మూలవిరాట్లకు అలంకరణ పనులు జరుగుతున్నాయని ఆలయ EO వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం అర్ధ మండపంలో ఉత్సవ మూర్తుల దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు.