News November 14, 2024

జగిత్యాల: పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు

image

పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూనే యువకుడు కుప్పకూలిన ఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మోత్కూరావుపేట గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చేటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. మండలంలోని కమ్మరిపేటకు చెందిన సంజీవ్(23) తన మేనమామ కొడుకు పెళ్లి బరాత్‌లో డాన్స్ చేస్తున్న క్రమంలో గుండెపోటుకు గురై కుప్పకూలాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. యువకుడి మృతితో పెళ్లింట విషాదం నెలకొంది.

Similar News

News December 8, 2024

సిరిసిల్ల: నిబంధనలు పాటిస్తూ హాజరు కావాలి: కలెక్టర్

image

గ్రూప్ 2 అభ్యర్థులు నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు హాజరుకావాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈనెల 9వ తేదీన అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాలకు సెల్‌ఫోన్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.

News December 8, 2024

SUలో జాబ్‌మేళా.. 427 మందికి ఆఫర్ లెటర్స్

image

KNR శాతవాహన యూనివర్సిటీ లో నిన్న మెగా జాబ్‌మేళాను నిర్వహించారు. ఇందులో భాగంగా మొత్తం 2649 మంది అభ్యర్థులు రిజిస్టర్ కాగా 845 మంది షార్ట్ లిస్ట్ అయ్యి 427 మంది కంపెనీల వద్ద నుంచి ఆఫర్ లెటర్లను పొందారు. కాగా జాబ్‌మేళాలో ఆఫర్ లెటర్ పొందిన అభ్యర్థులను నిర్వాహకులు, యూనివర్సిటీ అధికారులు అభినందించారు. ఈ మేళాను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

News December 8, 2024

జగిత్యాల: గుండెపోటుతో ఎంపీడీవో మృతి

image

జగిత్యాల జిల్లా బుగ్గారం MPDO గా విధులు నిర్వర్తిస్తున్న మాడిశెట్టి శ్రీనివాస్ శనివారం రాత్రి కరీంనగర్‌లోని ఆయన నివాసంలో గుండె పోటుతో మృతి చెందారు. ఫిబ్రవరిలో జరిగిన బదిలీల్లో ఆయన బుగ్గారం ఎంపీడీఓగా బదిలీ అయ్యారు. నిర్వహణలో నిన్న సాయంత్రం వరకు జగిత్యాలలో తోటి అధికారులు, తన సిబ్బందితో గడిపిన ఆయన మృతి చెందడంతో వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీంతో కరీంనగర్‌లో విషాదం నెలకొంది.