News April 5, 2025
జగిత్యాల :పోలీస్ ప్రధాన కార్యాలయంలో డా.జాగ్జీవన్ జయంతి

జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జాగ్జీవన్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచారన్నారు. భారత సమాజ నిర్మాణంలో తనదైన ముద్ర వేశారన్నారు.
Similar News
News January 1, 2026
హోంగార్డులను ప్రశంసించిన ఎస్పీ

హోంగార్డులకు జిల్లా ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ జీ.పాటిల్ అప్రిసియేషన్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే విధంగా విధులు నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ జగన్, ఆరే రాఘవరావు, ఆర్ఎస్ఐ గౌస్ పాషా, టీఆర్ఎస్ వెంకటనారాయణ పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డుల సేవలను జిల్లా పోలీస్ శాఖ అభినందించింది.
News January 1, 2026
మత్తులో మునిగిన కరీంనగర్.. జగిత్యాలదే పైచేయి!

ఇయర్ ఎండింగ్ డే సెలబ్రేషన్స్తో పల్లెలు, పట్టణాలు నిషాతో మత్తెక్కాయి. రికార్డు స్థాయిలో లిక్కర్ విక్రయాలు జరిగాయి. ఉమ్మడి KNRలో DEC 31న ఒక్కరోజే రూ.25.67 మద్యం అమ్ముడుపోయింది. PDPL- రూ.7.27 కోట్లు, KNR-రూ.7.24 కోట్లు, సిరిసిల్ల రూ3.10 కోట్లు, JGTL- రూ.8.07 కోట్ల లిక్కర్ IML డిపో నుంచి డిస్పాచ్ అయింది. ఎక్సైజ్ అధికారులు రూ.33.34కోట్ల మద్యం విక్రయాలు జరుగుతాయని అంచనావేయగా ఈసారి టార్గెట్ రీచ్ కాలేదు.
News January 1, 2026
రామగిరి: అరగంట వ్యవధిలో తండ్రీ, కుమారుడి మృతి

పెద్దపల్లి(D) రామగిరి(M) నాగేపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. రెండు సంవత్సరాలుగా పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఎరుకల రాజేశం(60) గురువారం మధ్యాహ్నం మృతి చెందగా, కుమారుడు శ్రీకాంత్ (37) అనారోగ్యంతో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒకే రోజు తండ్రి, కొడుకులు అరగంట వ్యవధిలో మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతుంది.


